IPL 2024 KKR VS Delhi Capitals :మహేంద్ర సింగ్ ధోనీ శిష్యుడిగా పేరొందిన రిషబ్ పంత్ రోడ్ యాక్సిడెంట్‌లో గాయాలై క్రికెట్‌కు దూరమయ్యాడు. అలా 15 నెలల విరామం తర్వాత గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగానే ఎలా ఆడుతాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే రిషబ్‌కు ఇబ్బందులు తప్పవంటూ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే అనుకున్నట్టుగానే మంచి ప్రదర్శన కనబరిచేందుకు ఐపీఎల్ తొలి రెండు మ్యాచులలో కాస్త తడబడ్డాడు పంత్.
కానీ, మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై చెలరేగాడు. ఇప్పుడు తాజాగా జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ దిల్లీపై దూకుడు ప్రదర్శించాడు. అలా వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. కోల్‌కతాపై జరిగిన మ్యాచ్‌లో అయితే 23 బంతుల్లోనే అర్ధ శతకం ఫీట్ సాధించాడు. దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫలితం ఎలాగున్నా ఆ జట్టు అభిమానులను నిరాశపరచకుండా పంత్ ఇన్నింగ్స్ సాగిందనే చెప్పాలి.
కోల్‌కతా నిర్దేశించిన 273 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన పంత్ నిలదొక్కుకున్నాడు. వరుస వికెట్ల పతనం అనంతరం దిగినా దూకుడులో ఏ మాత్రం సంశయం చూపించలేదు. ఒత్తిడిని తట్టుకుంటూ 4 ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగి 25 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టులో హై స్కోరర్‌గా నిలిచాడు. కెరీర్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడే పంత్‌ను చూసిన వాళ్లంతా పాత పంత్ తిరిగొచ్చేశాడనే రీతిలో సాగింది ఇన్నింగ్స్. 13వ ఓవర్ చక్రవర్తి బౌలింగ్ వేస్తుండగా రెండో బంతిని ఎదుర్కోబోయి శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు పంత్. అయితే అవుట్ అయ్యే ముందు 12వ ఓవర్లో 4, 6, 6, 4, 4, 4లతో మెరుపు షాట్లు ఆడి ఒకే ఓవర్లో 28 పరుగులు నమోదు చేయడం విశేషం. ఇక పంత్ ఇన్నింగ్స్‌ను స్టాండ్స్‌లో కూర్చిన చూసిన కేకేఆర్ యజమాని, స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా ఫిదా అయిపోయాడు. చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశాడు.
కాగా, మ్యాచ్‌లో పంత్ (55), ట్రిస్టన్ (54) మినహాయిస్తే జట్టులో ఎవరూ రాణించలేకపోయారు. డేవిడ్ వార్నర్ (18), పృథ్వీ షా (10), మిచెల్ మార్ష్ (0), అభిషేక్ పటేల్ (0), అక్సర్ పటేల్ (0), సుమిత్ కుమార్ (7), రసిఖ్ దర్ సలామ్ (1), ఎన్రిచ్ నార్జే (4), ఇషాంత్ శర్మ (1) పరుగులు మాత్రమే చేయగలిగారు. కాగా, ఐపీఎల్ 2024వ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన దిల్లీ క్యాపిటల్స్ ఒక్క మ్యాచ్ మినహా మిగతా వాటిలో పరాజయం ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.
6 బంతుల్లో 6 బౌండరీలు - పంత్ మెరుపు షాట్లకు షారుక్ ఫిదా! - IPL 2024 KKR VS Delhi Capitals - IPL 2024 KKR VS DELHI CAPITALS
IPL 2024 KKR VS Delhi Capitals : గాయాలను ఎదుర్కొని, విమర్శలను దాటుకొని చెలరేగిపోయాడు పంత్. ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. తాజాగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోను తమ జట్టు ఓడినప్పటికీ అదిరే ప్రదర్శన చేశాడు.
6 బంతుల్లో 6 బౌండరీలు - పంత్ మెరుపు షాట్లకు కేకేఆర్ యజమాని షారుక్ ఫిదా!
Published : Apr 4, 2024, 8:09 AM IST
|Updated : Apr 4, 2024, 11:15 AM IST
Last Updated : Apr 4, 2024, 11:15 AM IST