తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2024 - సీఎస్కే టాప్​ - అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌ చేరిన జట్లు ఇవే - IP 2024 play offs

IPL 2024 PlayOffs List : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న సీఎస్కే - ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ లీగ్​లో ట్రోఫీని ముద్దాడేందుకు అన్నీ జట్లు తమ వంతుగా ఎంతో శ్రమిస్తాయి. మరి లీగ్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఏంటో తెలుసుకుందాం.

IPL 2024 ముంబయి టాప్​ - అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌ చేరిన జట్లు ఇవే
IPL 2024 ముంబయి టాప్​ - అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌ చేరిన జట్లు ఇవే

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 3:11 PM IST

Updated : Mar 14, 2024, 6:58 PM IST

IPL 2024 PlayOffs List : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌ ప్రారంభానికి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఈ మెగాలీగ్​లో అత్యథికంగా ప్లేఆఫ్స్​కు వెళ్లిన జట్లు ఏంటో చూద్దాం.

Chennai Super Kings : ఐపీఎల్​లో ఎక్కువ సార్లు ప్లేఆఫ్స్‌ చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌ ఉంది. 14 సీజన్లలో బరిలోకి దిగి 12సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది.అత్యధిక (10) సార్లు ఫైనల్స్‌ ఆడిన రికార్డ్​ చెన్నైదే. 2010, 2011, 2018, 2021, 2023 ట్రోఫీని గెలుచుకుంది. ఐదుసార్లు 2008, 2012, 2013, 2015, 2019 రన్నరప్​గా నిలిచింది.

Mumbai Indians : 16 సీజన్లలో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్‌ 10సార్లు ప్లేఆఫ్స్‌కు, ఆరుసార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 2013, 2015, 2017, 2019, 2020లో ట్రోఫీని ముద్దాడింది. ఈ ఐదు కూడా రోహిత్ కెప్టెన్సీలోనివే కావడం విశేషం.

Royal Challengers Bangalore : ఆర్సీబీకి ఎంత క్రేజ్ ఉన్నా ఆ జట్టు మాత్రం ఇప్పటివరకు టైటిల్​ను అందుకోలేదు. 16 సీజన్లలో బరిలోకి దిగి ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మూడుసార్లు ఫైనల్స్‌కు వెళ్లింది. 2009, 2011, 2016 రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

Kolkata Knight Riders : ఇప్పటివరకు ఈ జట్టు 16 సీజన్లు ఆడి 7 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మూడుసార్లు ఫైనల్స్‌కు వెళ్లి రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. 2012 గంభీర్‌ సారథ్యంలో, 2014లో టైటిల్‌ను అందుకుంది. 2021లో సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

Sunrisers Hyderabad : ఈ జట్టు ఇప్పటివరకు 11 సీజన్లలో పాల్గొని ఆరుసార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. 2016 ఫైనల్‌లో ఆర్సీబీపై గెలిచి తొలిసారి ట్రోఫీని అందుకుంది. 2018లో అద్భుతంగా ఆడి ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2020లో 3వ స్థానం, 2013, 2017, 2019లో 4వ స్థానంలో నిలిచింది.

Delhi Capitals : ఇప్పటివరకు 16 సీజన్లలో ఆడిన ఈ జట్టు ఆరు సార్లు ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది. ఒక్కసారి 2020లో ఫైనల్‌కు చేరింది. అందులో ముంబయిపై ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2009, 2012, 2019, 2021లో 3వ స్థానం, 2008లో 4వ స్థానంలో నిలిచింది.

ఇక ఇతర జట్లలో అత్యధికంగా రాజస్థాన్‌ రాయల్స్‌ 14 సీజన్లలో ఐదుసార్లు ప్లేఆఫ్స్‌కు, గుజరాత్ టైటాన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఆడిన రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇక పంజాబ్‌ కింగ్స్ 16 సీజన్లలో ఆడి కేవలం రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.

KKR ఫ్యాన్స్​కు షాకింగ్ న్యూస్- ఐపీఎల్​కు అయ్యర్ దూరం!

రెండో కప్పుకోసం ఇంకెన్నేళ్లో- ఈసారైనా కల ఫలించేనా?

Last Updated : Mar 14, 2024, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details