తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రోహిత్ చెప్పింది కరెక్ట్​ - అతడి మాటలను నేను ఏకీభవిస్తున్నాను' - Kohli T20 World Cup - KOHLI T20 WORLD CUP

KohliT20 Worldcup 2024 : కోహ్లీ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇచ్చాడు. ఎప్పటిలానే పరుగులు చేయాలనే కసితో ఉన్నానని, ఆ మైండ్‌ సెట్‌ లేనప్పుడు ఏ టోర్నీలోనూ తనను చూడలేరని చెప్పాడు. ఇంకా వరల్డ్ కప్‌ గురించి మాట్లాడాడు. పూర్తి వివరాలు స్టోరీలో.

The Associated Press and ANI
Kohli rohith (The Associated Press and ANI)

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 8:58 PM IST

Kohli T20 Worldcup 2024 : తనపై వస్తోన్న విమర్శలతో పాటు ఐపీఎల్​లో తన స్ట్రైక్‌ రేట్, టీ20 వరల్డ్‌ కప్‌, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై మాట్లాడాడు టీమ్​ ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ.

టీ20 వరల్డ్‌ కప్‌ గురించి -ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా అద్భుతంగా రాణిస్తుందని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు. "నేను ఎప్పటిలాగే పరుగులు చేయాలనే కసితో ఉన్నాను. నాకు పరుగులు సాధించాలనే కసి ఆకలి లేనప్పుడు మీరు నన్ను ఏ టోర్నీలోనూ చూడలేరు. ఆ మైండ్‌ సెట్‌ లేకపోతే నేను క్రికెట్‌ ఆడలేను. వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో ఎనర్జీ ఉంటుంది. ఒకసారి జట్టులో మంచి వాతావరణం వస్తే జర్నీ అద్భుతంగా ఉంటుంది. గత వన్డే ప్రపంచ కప్‌ను నిజంగా ఆస్వాదించాం. ఈసారి కూడా మంచి టోర్నమెంట్‌ను ఆశిస్తున్నాం." అని కోహ్లీ పేర్కొన్నాడు.

మా నాన్న నుంచి నేర్చుకున్నాను - "నేను ఎవరి దగ్గరికైనా వెళ్లి నా గురించి మాట్లాడవద్దని చెప్పాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఏమి చేయగలనో నాకు తెలుసు. నాకు ఎవరి అప్రూవల్‌ అవసరం లేదు. నాకు ఎలాంటి వ్యాలిడేషన్‌ వద్దు. నేను ఇది నా చిన్నతనంలో మా నాన్నగారు నుంచి నేర్చుకున్నాను. ఓ సందర్భంలో నాకు అన్‌ ఫెయిర్‌ వేలో స్టేట్ క్రికెట్‌ ఆడే అవకాశం వచ్చింది. కష్టపడి సెలెక్ట్‌ అయితే సరే, ఇలా అవసరం లేదని మా నాన్న చెప్పారు. నాకు పెర్‌ఫార్మెన్స్‌ మాత్రమే ముఖ్యం. అందుకే 16 ఏళ్ల పాటుగా క్రికెట్‌ ఆడుతున్నాను." అని విరాట్ అన్నాడు.

విమర్శలపై కోహ్లీ - "దేనికీ నేను స్పందించాల్సిన అవసరం లేదు. గ్రౌండ్‌లో నేనేం చేయగలనో నాకు తెలుసు. ఎవరితోనూ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మ్యాచ్‌లు ఎలా గెలవాలి అని నేను ఎవరినీ అడగలేదు. నేను ఆ పరిస్థితుల్లో ఉన్నాను. ఫెయిల్‌ అయ్యాను. నేర్చుకున్నాను. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లను యాదృచ్ఛికంగా గెలవవచ్చు. కానీ మీరు నిలకడగా రాణిస్తే అది యాదృచ్ఛికంగా జరిగే అవకాశమే లేదు." అని కోహ్లీ చెప్పాడు.

  • ఐపీఎల్‌ స్ట్రైక్‌ రేట్, ఇంపాక్ట్ రూల్(Impact rule Kohli)
    "ఒక ఎక్స్‌ట్రా బ్యాటర్‌ అందుబాటులో ఉండటం వల్లే నేను పవర్‌ ప్లేలో 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాను. ఇంపాక్ట్​ రూల్​ గురించి రోహిత్ అన్న మాటలను నేను ఏకీభవిస్తాను. ఇంపాక్ట్ రూల్​ బ్యాలెల్స్‌ను దెబ్బతీస్తుందని నేను భావిస్తున్నాను. నేనే కాదు చాలా మంది అభిప్రాయం ఇదే." అని విరాట్ పేర్కొన్నాడు. కాగా, అంతకు ముందు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్ కూడా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ రూల్ కారణంగా శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదని ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ వల్ల ఆల్‌రౌండర్లకు ఇబ్బందని తనకు రూల్‌ నచ్చలేదని రోహిత్‌ పేర్కొన్నాడు.
    Kohli rohith (The Associated Press and ANI)

    ధోనీ రిటైర్మెంట్​పై కోహ్లీ కీలక కామెంట్స్​ - ఇప్పుడందరూ దీని గురించే చర్చంతా! - IPL 2024 Dhoni Kohliఆ రోజే అమెరికాకు టీమ్ ​ఇండియా ప్లేయర్స్​! - T20 World Cup 2024

ABOUT THE AUTHOR

...view details