IPL 2024 Gujarat Titans VS LSG :ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన లఖ్‌నవూ సూపర్ జెయంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఇండియన్ బౌలర్ యశ్ ఠాకూర్ చెలరేగిపోయాడు. చాకచక్యంగా బంతులను సంధిస్తుంటే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. 164 పరుగల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ను ఆరంభం నుంచి ఇరకాటంలో పెట్టేశాడు యశ్. 30 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో LSGకి 33పరుగుల ఆధిక్యంతో విజయాన్ని కట్టబెట్టాడు. ఈ సక్సెస్ అంతా జట్టు వ్యూహం, ప్రణాళికలకు కట్టుబడి ఉండటంతోనే సాధ్యమైందని, ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్ టార్గెట్ చేసుకుని ఆడామని యశ్ వివరించాడు. కాగా, యశ్ అత్యుత్తమ ప్రదర్శనకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
యశ్ ఠాకూర్ మాట్లాడుతూ - "5 వికెట్లు తీయడం, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోవడం చాలా సంతోషం. గిల్‌ను పడగొట్టాలని అనుకున్నాను. కేఎల్ రాహుల్ కూడా అదే చేయమనడంతో వర్కౌట్ అయింది. దురదృష్టవశాత్తు మయాంక్ యాదవ్‌కు గాయమైంది. వీలైనంత వరకూ నువ్వే పూర్తి చేయాలని రాహుల్ అన్నాడు. ఈ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తొలి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది" అని పేర్కొన్నాడు.
దానికి కట్టుబడి ఉన్నా - అందుకే ఈ విజయం : మ్యాచ్ హీరో యశ్ ఠాకూర్ - IPL 2024 Gujarat Titans VS LSG - IPL 2024 GUJARAT TITANS VS LSG
IPL 2024 Gujarat Titans VS LSG : టీమిండియా బౌలర్ యశ్ ఠాకూర్ లఖ్‌నవూ సూపర్ జెయంట్స్ విజయాన్ని శాసించాడు. ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను చిత్తు చేస్తూ జట్టు 33 పరుగుల ఆధిక్యంతో గెలుపొందేందుకు కారణమయ్యాడు.
Etv Bharat
Published : Apr 8, 2024, 8:10 AM IST