తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ 'ఫైనల్'- రైజర్స్ Vs రైడర్స్​- మ్యాచ్ జరగకపోతే పరిస్థితేంటి? - IPL 2024 - IPL 2024

IPL 2024 Final : ఐపీఎల్ 17వ సీజన్‌ టైటిల్‌ కోసం కోల్‌కతా - హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. మరి మ్యాచ్ జరగకపోతే పరిస్థితేంటి?

IPL 2024 Final
IPL 2024 Final (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 6:12 PM IST

Updated : May 26, 2024, 6:27 PM IST

IPL 2024 Final : ఐపీఎల్ 17వ సీజన్‌ టైటిల్‌ కోసం కోల్‌కతా - హైదరాబాద్‌ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. చెన్నైలోని చెపాక్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తోంది. శనివారం కూడా వర్షం పడటంతో కేకేఆర్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు చేసుకుంది. ఆదివారం ఉదయం నుంచి వర్షం పడకపోయినా ఆకాశం మేఘావృతమై ఉంది. ఆక్యూవెదర్ రిపోర్ట్‌ ప్రకారం పూర్తి మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. కేవలం 4 శాతం మాత్రమే వాన కురిసే సూచనలు ఉన్నాయి.

అలా జరిగితే కేకేఆర్‌ విజేత!
ఒకవేళ ఈ రోజు వర్షం కారణంగా మ్యాచ్‌ జరగకపోయినా సమస్య లేదు. ఎందుకంటే ఐపీఎల్‌ ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది. మ్యాచ్‌ను సోమవారం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. ఆ రోజు కూడా మ్యాచ్‌ సాధ్యం కాకపోతే మాత్రం మ్యాచ్‌ క్యాన్సిల్‌ అవుతుంది. పాయింట్స్‌ టేబుల్లో టాప్‌ పొజిషన్‌లో ఉన్నందున కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజేతగా నిలుస్తుంది. సన్‌రైజర్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకోక తప్పదు.

2023 ఫైనల్‌కు వర్షం అంతరాయం
ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ అహ్మదాబాద్‌లో జరిగింది. వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ను రిజర్వ్‌ డేలో నిర్వహించారు. మ్యాచ్‌లో గుజరాత్‌ 214/4 స్కోర్‌ చేసింది. వర్షం కారణంగా టార్గెట్‌ రివైజ్‌ చేశారు. సీఎస్కే 15 ఓవర్లో 171 పరుగులు చేయాల్సి వచ్చింది. చెన్నై చివరికి 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. అప్పటికి సమయం 1:35 AM. అంటే మూడో రోజుకు ఆట వెళ్లింది.

అలా ఫైనల్స్‌కు చేరాయి?
కేకేఆర్‌ లీగ్‌ స్టేజ్‌లో 14 మ్యాచుల్లో 9 విజయాలు, 3 ఓటములు అందుకుంది. 2 మ్యాచుల్లో ఫలితాలు తేలకపోవడంతో ఒక్కో పాయింట్‌ అందుకుంది. మొత్తంగా 20 పాయింట్లతో పాయింట్స్‌ టేబుల్లో టాప్ పొజిషన్లో నిలిచింది. క్వాలిఫైయర్‌ 1లో రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌పై గెలిచి నేరుగా ఫైనల్లో అడుగు పెట్టింది. లీగ్‌ స్టేజ్‌లో హైదరాబాద్‌ 14 మ్యాచుల్లో 8 గెలవగా, 3 ఓడిపోయింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మొత్తంగా 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫైయర్‌ 1లో అవకాశం కోల్పోయిన సన్‌రైజర్స్‌ మళ్లీ ఆ తప్పును రిపీట్‌ చేయలేదు. క్వాలిఫైయర్‌ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయం అందుకుని, ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఫైనల్‌కు ముందు ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ కెప్టెన్‌ కమిన్స్‌ మాట్లాడుతూ "లీగ్‌ చాలా అద్భుతంగా జరిగింది. ఈ జర్నీ ఏదో ఒక పాయింట్‌లో ఆగాలి. కొన్ని సంవత్సరాలుగా క్రికెట్‌లో గొప్ప విజయాలు అందుకున్నాను. ఈ టోర్నమెంట్‌కు ముందు నేను T20లో కెప్టెన్‌గా ఉండలేదు. ఈ ఫార్మాట్‌ చాలా వేగంగా ఉంటుంది. గత సంవత్సరం వన్డేలకు కెప్టెన్సీ చేశాను. ఇప్పుడు టీ20లు కొత్తగా ఏం అనిపించలేదు" అన్నాడు.

పిచ్‌ పరిస్థితి ఏంటి?
ఫైనల్‌కు ఉపయోగిస్తున్న పిచ్‌, రెడ్‌-సాయిల్‌ స్ట్రిప్. మే 1న పంజాబ్ కింగ్స్ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌కు కూడా ఇదే ఉపయోగించారు. క్వాలిఫయిర్‌ 2 పిచ్‌ కంటే ఈ పిచ్‌ భిన్నంగా ఉందని కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పాడు. "ఈ రోజు నేల ఎర్రగా ఉంది, కానీ నిన్న నల్లగా ఉంది. టీవీలో చూస్తూ, డెవ్‌(Dew) కీలక పాత్ర పోషిస్తుందని ఊహించాం. కానీ అలా జరగలేదు. బాల్‌ స్పిన్‌ అయ్యింది" అని చెప్పాడు.

Last Updated : May 26, 2024, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details