IPL 2024 CSK VS SRH Abhishek Sharma :ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) - చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బౌలింగ్‌ను ఉతికారేసింది. అభిషేక్ శర్మ అయితే తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఉప్పల్ స్టేడియాన్ని ఉపేశాడు. తన రెండో ఓవర్లోనే దుమ్ముదులిపేస్తూ పరుగుల వరద పారించాడు. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఈ మార్క్ చూపిస్తూ సిక్సర్ల మోత మోగించాడు. .
ఈ ఓవర్లో కళ్లు చెదిరే షాట్స్ ఆడుతూ ఏకంగా 27 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ. 4, 0, 6, 0, నోబాల్ 6, 6, 4 తో మైదాాన్ని హోరెత్తించాడు. అలా మూడు సిక్సర్లు, నో బాల్, రెండో ఫోర్లతో కలిపి ధనాధన్ ఇన్నింగ్స్ చేశాడు. అయితే ఈ క్రమంలోనే మరో భారీ షాట్ బాదే క్రమంలో 37 పరుగులు చేసిన ఔట్ అయ్యాడు అభిషేక్ శర్మ. మొత్తంగా ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఇక ఇతడి ఇన్నింగ్స్ చూసిన అభిమానులు ఉప్పల్‌లో బాదుతుంటే తుప్పల్లో పడుతున్నాయి అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.
ఇకపోతే ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. దీంతో ఆ జట్టు పవర్ ప్లేలో మరో రికార్డ్ స్కోర్ చేసింది. పవర్ ప్లేలో ఓ వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది.