Gold Rate Today June 27, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 73,770 ఉండగా, గురువారం నాటికి రూ.470 తగ్గి రూ.73,300కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.89,332 ఉండగా, గురువారం నాటికి రూ.162 తగ్గి రూ.89,170కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 27, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,300గా ఉంది. కిలో వెండి ధర రూ.89,170 ఉంది.
- Gold Price In Vijayawada June 27, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,300గా ఉంది. కిలో వెండి ధర రూ.89,170గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 27, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,300గా ఉంది. కిలో వెండి ధర రూ.89,170గా ఉంది.
- Gold Price In Proddatur June 27, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,300గా ఉంది. కిలో వెండి ధర రూ.89,170గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2317 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 16 డాలర్లు తగ్గి 2301 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.80 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 27, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,20,155 |
ఇథీరియం | రూ.2,63,000 |
టెథర్ | రూ.79.31 |
బైనాన్స్ కాయిన్ | రూ.47,916 |
సొలోనా | రూ.11,454 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 27, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 78,506 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 36 పాయింట్లు కుంగి 23,832 దగ్గర కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, మారుతీ, ఎల్ అండ్ టీ, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్