ETV Bharat / bharat

"హిమాలయాల్లో సూర్యోదయపు అందాలు" - IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! - అందుబాటు ధరల్లోనే! - IRCTC Hyderabad Nepal Tour

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 10:45 AM IST

IRCTC Hyderabad Nepal Tour: నేపాల్ మంచుకొండల అందాలను చూస్తే.. అదొక అద్వితీయమైన అనుభూతి. మీరు కూడా ఆ అనుభూతిని పొందాలని అనుకుంటే.. మీకోసం సూపర్​ ప్యాకేజ్​ అందుబాటులో ఉంది. ఐఆర్‌సీటీసీ టూరిజం బెస్ట్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.

IRCTC Hyderabad Nepal Tour
IRCTC Hyderabad Nepal Tour (ETV Bharat)

IRCTC Tourism Hyderabad - Nepal Tour: మంచుకొండలను చూస్తే.. ఎవ్వరైనా పరవశించిపోవాల్సిందే. ఈ పరవశం మీక్కూడా కలిగించేందుకు IRCTC ఓ సూపర్​ ప్యాకేజీ ప్రకటించింది. నేపాల్​లోని అందాలను వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్​ జర్నీ టూర్ ఆపరేట్​ చేస్తోంది. మరి ఈ టూర్​ ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

"రాయల్ నేపాల్ ఎక్స్​ హైదరాబాద్​(Royal Nepal Ex Hyderabad)" పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ టూర్​ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో నేపాల్‌లోని కాఠ్​మండూ, పోఖారా ప్రాంతాలు కవర్ అవుతాయి. నేపాల్ టూర్ వెళ్లాలనుకునేవారికి తప్పనిసరిగా పాస్‌పోర్ట్ లేదా వోటర్ ఐడీ ఉండాలి.

ప్రయాణ వివరాలివే:

  • IRCTC "రాయల్ నేపాల్" టూర్ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఉదయం ఫ్లైట్ ఎక్కితే సాయంత్రానికి నేపాల్ రాజధాని కాఠ్​మండూ చేరుకుంటారు. సాయంత్రం ఖాళీ సమయంలో స్థానిక ప్రాంతాలు చూడొచ్చు. రాత్రికి కాఠ్​మండూలో బస ఉంటుంది.
  • రెండో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత పశుపతినాథ్ ఆలయం, బుద్ధనాథ స్థూప, పఠాన్, దర్బార్ స్క్వేర్, స్వయంభునాథ్ స్థూపం సందర్శించవచ్చు. రాత్రి భోజనం తర్వాత కాఠ్​మండూలో బస చేయాలి.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత పోఖారాకు బయల్దేరాలి. దారిలో మనకమన ఆలయం సందర్శించాలి. సాయంత్రం స్థానిక ప్రాంతాల్లో షాపింగ్​ చేయొచ్చు. రాత్రికి పోఖారాలో స్టే చేయాలి.

IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ - తక్కువ ధరకే రెండు జ్యోతిర్లింగాలు, ప్రముఖ ఆలయాల దర్శనం! - Madhya Pradesh Jyotirlinga Darshan

  • నాలుగో రోజు తెల్లవారుజామున సూరంగ్‌కోట్‌కు బయల్దేరాలి. అక్కడ సూర్యోదయాన్ని చూడొచ్చు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. బింధ్యబాసిని మందిర్, డెవిల్స్ ఫాల్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ సందర్శించవచ్చు. రాత్రికి పోఖారలో బస చేయాలి.
  • ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత కాఠ్​మండూకు బయల్దేరాలి. హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత.. అక్కడ లోకల్​ ప్లేస్​లను విజిట్​ చేయవచ్చు. రాత్రికి కాఠ్​మండూలో బస ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ అయ్యి కాఠ్​మండూ ఎయిర్​పోర్ట్​కు చేరుకుని అక్కడ ఉదయం 10:50 గంటలకు ఫ్లైట్​ ఎక్కితే రాత్రి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ధర వివరాలివే:

  • ఐఆర్‌సీటీసీ ‘రాయల్ నేపాల్’ టూర్ ప్యాకేజీలో టికెట్​ ధరలు చూస్తే.. కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యుపెన్సీ ధర రూ.55,630, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.46,550, ట్రిపుల్​ ఆక్యుపెన్సీ ధర రూ.45,250. ఇక పిల్లలకు చూస్తే.. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.40,110, 2 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.35,190గా నిర్ణయించారు.
  • ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి.
  • ఈ ప్యాకేజీ బుక్ చేసే పర్యాటకులు నేపాల్ జారీ చేసిన గైడ్‌లైన్స్, ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలి.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఊటీ అందాల్లో విహరించండి - తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ! - IRCTC Ultimate Ooty Ex Hyderabad

"లేహ్​" అందాల వీక్షణ కోసం IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర అందుబాటులోనే - వివరాలివే! - IRCTC Leh With Turtuk Package

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.