T20 Worldcup 2024 Semifinal South Africa VS Afghanisthan : టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరింది. అఫ్గాన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఘన విజయం సాధించింది. ఈ కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 57 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇకపోతే ఇప్పటి వరకు అనూహ్య విజయాలతో క్రికెట్ ప్రియులు, మాజీల దృష్టినీ ఆకర్షించిన అఫ్గానిస్థాన్ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సౌతాఫిక్రా బ్యాటర్లలో ఓపెనర్ డికాక్ (5) నిరాశపరిచినా హెండ్రిక్స్ (29), మార్క్రమ్ (23) రాణించారు.
57 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ (5) తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. మరోవైపు అఫ్గాన్ బౌలర్లు కూడా చురకత్తుల్లాంటి బంతులు సంధించారు. దీంతో మరో ఓపెనర్ హెండ్రిక్స్ (29*), వన్ డౌన్‌లో వచ్చిన మార్‌క్రమ్ (23*) కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకొని ఆడారు. దీంతో మ్యాచ్ చాలా సులువుగానే ముగిసింది. అఫ్గాన్ జట్టు ఇంకాస్త్ ఎక్కువ స్కోరు చేసి ఉంటే సఫారీలకు గట్టి పోటీ ఇచ్చేదేమో. అఫ్గాన్ బౌలర్లలో ఫరూకీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
🟡🟢 FINALS BOUND | #SAvAFG
— Proteas Men (@ProteasMenCSA) June 27, 2024
The dream continues, South Africa! ✨🇿🇦🚀
📖 For the first time in history, the Proteas are through to the ICC T20 World Cup Finals. See you in Barbados! 🏟️#WozaNawe #BePartOfIt#OutOfThisWorld #T20WorldCup pic.twitter.com/2WWBXYTN1j
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులు మాత్రేమే చేసి ఆలౌట్ అయింది. టోర్నీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అసాధారణ ప్రదర్శన చేసిన అఫ్గాన్ జట్టు బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (10) తప్ప మిగతా వారెవరు కూడా రెండంకెల స్కోరు నమోదు చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం వరుస వికెట్లు తీస్తూ అఫ్గాన్‌ను కుప్పకూల్చేశారు. ఓపెనర్లు గుర్బాజ్ (0), జర్దాన్ (2), వన్ డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) పూర్తిగా విఫలమయ్యారు.
అయితే ఒమర్జాయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. కానీ, నోకియా బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ (8) కూడా నిరాశపరిచాడు. నబీ (0), జనత్ (8), నూర్ ఆహ్మద్ (0), నవీనుల్ హక్ (2) అందరూ విఫలమయ్యారు. ఫరూకీ (2*) నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్, షంసీ చెరో 3 వికెట్లు పడగొట్టగా, రబాడా, నోకియా తలో 2 వికెట్లు తీశారు.
నితీశ్‌కు గాయం - అతడికి చోటు - Nitish kumar Injured
ఇంగ్లాండ్‌తో తేల్చుకోవాల్సిన లెక్కలెన్నో- దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే! - 2024 T20 World cup