IPL 2024 Centuries List : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండుగ లాంటిది. ముఖ్యంగా బ్యాటర్లు బౌండరీలు, సెంచరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తుంటారు. పలు రికార్డులను తమ పేరిట లిఖించుకుంటుంటారు. అలా రెండు నెలల పాటు క్రికెట్ ప్రపంచంలోని స్టార్లంతా ఒక్కతాటిపైకి వచ్చి మైదానంలో విజృంభిస్తుంటారు. అలానే యంగ్ క్రికెటర్స్ కూడా తమలోని టాలెంట్‌ను బయటపెడుతుంటారు. జాతీయ జట్టు ఎంట్రీకి అవకాశాలను అందుకుంటుంటారు. ఈ సీజన్ టోర్నీ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో సెంచరీలు చేసిన ఆటగాళ్లేవరో తెలుసుకుందాం.
1. విరాట్ కోహ్లీ : ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు మొత్తం 7 సెంచరీలు సాధించాడు. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 113.
2. క్రిస్ గేల్ : ఐపీఎల్‌లో కోహ్లీ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. 6 సెంచరీలు బాదాడు. 175 అత్యధిక స్కోర్ చేశాడు.
3. జోస్ బట్లర్ : ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా తన పేరిట 5 సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోరు 124.
4. కేఎల్ రాహుల్ : లఖ్‌నవూ జెయింట్స్ కెప్టెన్ 4 సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 132.
5. షేన్ వాట్సన్ : షేన్ వాట్సన్ కూడా 141 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు సాధించాడు.