Indian Bowlers vs Eng Test:స్వదేశంలో టీమ్ఇండియా జనవరి 25నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే గత కొంతకాలంగా టెస్టుల్లో ఇంగ్లాండ్ బజ్‌బాల్ విధానాన్ని అనుసరిస్తుంది. ఏ దేశంలో పర్యటించినా ఇంగ్లీష్ జట్టు దూకుడుగా ఆడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పిచ్‌లపై ఇంగ్లాండ్ ఎలా ఆడుతుందన్నది ఆసక్తిగా మారింది. అయితే భారత్- ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమ్ఇండియా (ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లు) బౌలర్లెవరంటే?
- రవిచంద్రన్ అశ్విన్:టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత్- ఇంగ్లాండ్ టెస్టుల్లో అత్యధిత వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు. అతడు 2011 నుంచి 19 టెస్టుల్లో 88 వికెట్లు దక్కించుకున్నాడు. అందులో 6సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. చివరిసారిగా 2021 ఒక్క పర్యటనలో అశ్విన్ 32 వికెట్లతో అదరగొట్టాడు. ఓవరాల్‌గా భగవత్ చంద్రశేఖర్ (95), అనిల్ కుంబ్లే (92) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- ఇషాంత్ శర్మ:పేసర్ ఇషాంత్ శర్మ ఈ లిస్ట్‌లో 61 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇషాంత్ భారత్‌లోనే కాకుండా ఇంగ్లాండ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 2011 నుంతి 21 టెస్టుల్లో ఇషాంత్ శర్మ 61 వికెట్లు దక్కించుకున్నాడు.
- రవీంద్ర జడేజా: ఆల్‌రౌండర్ జడేజాకు కూడా ఇంగ్లాండ్‌పై ఘనమైన రికార్డే ఉంది. ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచ్‌ల్లో ఆడిన జడేజా 35 సగటున 51 వికెట్లు పడగొట్టాడు.
- మహ్మద్ షమీ: స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇంగ్లాండ్‌పై 15 టెస్టుల్లో 44 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక ఈ సిరీస్‌కు షమీ ఫిట్నెస్ కారణాల వల్ల ఎంపిక కాలేదు.
- జస్ప్రీత్ బుమ్రా: టీమ్ఇండియా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లోనూ మంచి ట్రాక్ రికార్డు మెయింటెన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం 10 టెస్టుల్లోనే 41 వికెట్లు పడగొట్టాడు.
అశ్విన్@500: అశ్విన్ టెస్టు ఫార్మాట్లో 500 వికెట్లు మైలురాయికి మరో పది వికెట్ల దూరంలో ఉన్నాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటివరకు కెరీర్లో 95 మ్యాచ్‌లు, 179 ఇన్నింగ్స్‌ల్లో 490 వికెట్లు నేలకూల్చాడు. మరో 10 వికెట్లు పడగొడితే టెస్టుల్లో 500+ వికెట్లు దక్కించుకున్న తొమ్మిదో బౌలర్‌గా అశ్విన్ నిలుస్తాడు.