India Women vs South Africa Women :బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం సౌతాఫ్రికా ఉమెన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ప్రారంభంలో పరుగులు సులువుగా రాలేదు. ఓ స్టేజ్‌లో భారత్ 99/5 పరుగులతో కష్టాల్లో పడింది. ఆ పరిస్థితుల నుంచి మంధాన ఇండియాని గట్టెక్కించింది. అద్భుత సెంచరీతో భారీ స్కోరును అందించింది.
మంధాన, దీప్తి శర్మ 50 పరుగుల పార్ట్‌నర్‌షిప్ భారత్‌ని మెరుగైన స్థితిలోకి తీసుకొచ్చింది. 43వ ఓవర్‌లో మంధాన సెంచరీ అందుకుంది. 117 పరుగుల వద్ద మంధాన అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది. బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో షాట్ ఆడబోయి ఫీల్డర్ చేతికి చిక్కింది.
చెలరేగిన భారత బౌలర్లు
భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. దక్షిణాఫ్రికాలో సూన్ లుస్ చేసిన 33 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత్ బౌలర్ ఆషా శోభన 8.4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకుంది. దీప్తి శర్మ 6 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. రేణుక, పూజ, రాధా యాధవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా 37.4 ఓవర్స్‌లో 122 పరుగులకే ఆలౌట్ అయింది.
స్మృతి - ఆ జాబితాలో రెండో ప్లేయర్‌గా
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. దేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. అద్భుత సెంచరీతో, మంధాన 7000 పరుగుల మార్కును దాటింది.
మంధాన దక్షిణాఫ్రికాపై 127 బంతుల్లో 117 పరుగులు చేసింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లే ఆమె చేసిన పరుగులు 7,059కి చేరింది. ఆమె కంటే ముందు మాజీ కెప్టెన్ మిథాలీ(10,868) మాత్రమే ఉంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డ్ క్రియేట్ చేస్తుందా?
ప్రస్తుత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ ఫీట్ సాధించడానికి ఎంతో దూరంలో లేదు. ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మూడు ఫార్మాట్స్‌లో కలిపి 6,870 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఆమె మంధానను అధిగమించే అవకాశం లేకపోలేదు.
భారత వైస్ కెప్టెన్ మంధాన సొంత గడ్డపై వన్డేల్లో మొదటి సెంచరీని, మొత్తంగా కెరీర్‌లో ఆరో సెంచరీ బాదింది. హర్మన్‌ప్రీత్ సాధించిన ఐదు సెంచరీలను అధిగమించింది. ఇంటర్నేషనల్ వన్డేల్లో ఏడు సెంచరీలతో మిథాలీ మొదటి స్థానంలో ఉంది. మిథాలీ 211 ఇన్నింగ్స్‌లలో 7 సెంచరీలు కొట్టింది. అదే హర్మన్‌ప్రీత్ 112 ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలు చేసింది. మంధాన కేవలం 83 మ్యాచుల్లోనే ఆరు సెంచరీలు బాదేయడం గమనార్హం.
ఆమెను పెళ్లాడిన మహిళా క్రికెటర్ - అప్పుడు విరాట్‌కు ప్రపోజల్ - ఇప్పుడు ప్రేయసితో ఇలా - England Cricketer Danni Wyatt
మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ రిలీజ్- 'ఇండో-పాక్' మ్యాచ్ ఎప్పుడంటే? - T20 World Cup 2024 Women