తెలంగాణ

telangana

ETV Bharat / sports

208కి ఆలౌట్​ - శ్రీలంక చేతిలో భారత్ ఘోర పరాభవం - India Vs Sri Lanka 2nd ODI - INDIA VS SRI LANKA 2ND ODI

India Vs Sri Lanka 2nd ODI : శ్రీలంకతో జరిగిన రెండో వన్డే పోరులో భారత్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంక నిర్దేశించిన 240 లక్ష్యాన్ని చేధించలేక, 208కే ఆలౌటైపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో శ్రీలంక ముందంజలో ఉంది.

India Vs Sri Lanka 2nd ODI
India Vs Sri Lanka 2nd ODI (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Aug 4, 2024, 10:05 PM IST

Updated : Aug 4, 2024, 10:35 PM IST

India Vs Sri Lanka 2nd ODI :శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డే పోరులో శ్రీలంక చేతిలో భారత్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో 32 పరుగుల తేడాతో భారత్‌ ఓటమిపాలైంది. శ్రీలంక నిర్దేశించిన 240 లక్ష్యాన్ని చేధించలేక, 208కే ఆలౌటైపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో శ్రీలంక ముందంజలో ఉంది.

మ్యాచ్ సాగిందిలా :
టాస్‌ గెలిచి బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు స్కోర్ చేసింది. అవిష్క ఫెర్నాండో (40), దునిత్ వెల్లలాగె (39), కుశాల్ మెండిస్ (30), కమిందు మెండిస్ (40) తమ తమ ఇన్నింగ్స్​లో అదరగొట్టగా, చరిత్ అసలంక (25), అకీలా ధనంజయ (15),సదీర సమరవిక్రమ (14), జనిత్ (12), ఫర్వాలేదనిపించారు.

ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా, కుల్​దీప్ యాదవ్​ 2, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఆ తర్వాత లక్ష్యఛేదనలో రోహిత్‌ సేన 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ శర్మ (64) పోరాడినప్పటికీ భారత జట్టు విజయం సాధించలేకపోయింది. ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ (44), శుభ్‌మన్ గిల్ (35), జట్టుకు మంచి స్కోర్ అందించారు. మిగతా బ్యాటర్లెవరూ అంతగా స్కోర్​ చేయలేకపోయారు.

శ్రీలంక జట్టులో జెఫ్రి వాండర్సే 6 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో భారత్ ఓటమి ఖాయమైంది. మరో మూడు వికెట్లను కెప్టెన్ చరిత్ అసలంక పడగొట్టాడు. ఇక భారత్, శ్రీలంక మధ్య బుధవారం ఆగస్టు 7న నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఇందులో భారత్‌ గెలిస్తే సిరీస్‌ 1-1తో సమం అవుతుంది.

భారత్​ (తుది జట్టు) : రోహిత్ శర్మ (కెప్టెన్​), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్​దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

శ్రీ లంక (తుది జట్టు) :చరిత్ అసలంక (కెప్టెన్),పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్​), సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, దునిత్ వెల్లలగే, అకిల దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే.

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ - ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు - Cricket In Olympics

మన్కడింగ్ బాస్ అశ్విన్​​కే వార్నింగ్ ఇచ్చిన బౌలర్ - ఇప్పుడిదే హాట్​టాపిక్​! - Ravichandran Ashwin Mankad

Last Updated : Aug 4, 2024, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details