Ind vs Pak T20 World Cup:2024 టీ20 వరల్డ్‌కప్‌లో హై వోల్టేజ్ మ్యాచ్ భారత్- పాకిస్థాన్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. రెండు బలమైన జట్ల మధ్య పోరుకు యావత్ క్రీడా ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇక సాధారణంగానే ఇండోపాక్ మ్యాచ్‌కు అదరణ ఎక్కువగా ఉంటుంది. అయితే పొట్టికప్ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌దే పైచేయి. 2021 వరల్డ్‌కప్‌లో తప్ప పాక్‌తో తలపడిన అన్ని మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా నెగ్గింది. ఇక ఇదే జోరు ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ కొనసాగించాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
భారీ స్కోర్లు కష్టమే: అయితే భారత్- పాక్ మ్యాచ్ అంటే అభిమానులు భారీ స్కోర్లు ఆశిస్తారు. రోహిత్ భారీ సిక్సర్లు, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్‌లు, సూర్య 360 డిగ్రీల ఆట చూడాలని అనుకుంటారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆ మెరుపులేవీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ దాయాదుల పోరుకు ఆతిథ్యమిస్తున్న న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కు ఏ మాత్రం సహకరించట్లేదు. అందుకు ఇదే టోర్నీలో ఇదివరకు ఈ స్టేడియంలో జరిగిన శ్రీలంక- సౌతాఫ్రికా, ఐర్లాండ్- భారత్, కెనడా- ఐర్లాండ్, నెదర్లాండ్స్- సౌతాఫ్రికా మ్యాచ్‌లే నిదర్శనం. ఇందులో రెండుసార్లు 100లోపు స్కోర్లతోనే మ్యాచ్‌లు ముగిశాయి. మరోరెండు మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా 140 కూడా దాటలేదు. దీంతో భారత్- పాక్ పోరు కూడా లో స్కోరింగ్ మ్యాచ్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక హై వోల్టేజ్ మ్యాచ్ అంటే భారత్ బ్యాటర్లు vs పాకిస్థాన్ పేసర్లు అనేలాగా ఉంటుంది. ఇదివరకు జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇదే కొనసాగింది. పదునైన పేస్ దళం పాక్ సొంతం. అయితే షహీన్ షా అఫ్రిదీ, మహ్మద్ ఆమిర్ బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొవడం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇప్పుడున్న ఫామ్‌లో పెద్ద కష్టమేమీ కాదు. ఇక బౌలింగ్ అనుకూలించే పిచ్‌పై మన పేసర్లు బుమ్రా, అర్షదీప్ కూడా చెలరేగే ఛాన్స్ ఉంది.