India Vs New zealand Test Series : బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసి అబ్బురపరిచింది. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(150), రిషభ్ పంత్(99) ఈ ఇద్దరూ రాణించడం వల్ల జట్టు ఈ భారీ స్కోర్‌ను నమోదు చేసింది.
అయితే 356 పరుగుల తేడాతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగడం వల్ల న్యూజిలాండ్ ముందు టీమ్ఇండియా 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ టార్గెట్‌ను టీమ్ఇండియా కాపాడుకుంటుందా? లేదా అన్న అనుమానాలు క్రీడాభిమానుల్లో నెలకొంది.
కానీ, తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్‌కు ఈ లక్ష్యం ఏ మాత్రం కష్టం కాదని విశ్లేషకుల మాట. అయితే టెస్ట్ ఫార్మాట్‌లో చివరి రోజు లక్ష్యాన్ని చేధించడం ఏ జట్టుకైనా కష్టమని వారి మాట. ఎందుకంటే పిచ్‌పై పగుళ్లు ఏర్పడి వికెట్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందట. అది బౌన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయట. ఈ క్రమంలోనే ఈ 107 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా కాపాడుకుంటుందని వారి అభిప్రాయం.