తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో లాస్ట్ T20- భారత్​ 13ఏళ్ల రివెంజ్​ తీర్చుకుంటుందా? - IND VS ENG 2025

భారత్ x ఇంగ్లాండ్​ ఐదో టీ20- టీమ్ఇండియా 13ఏళ్ల ప్రతీకారం తీసుకుంటుందా?​

Ind vs Eng 5th T20
Ind vs Eng 5th T20 (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Feb 1, 2025, 7:38 PM IST

Ind vs Eng 5th T20 2025 : భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య చివరి టీ20 మ్యాచ్‌ ఆదివారం ముంబయి వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే 3-1తో ఒక మ్యాచ్ మిగిలుండగానే భారత్​ సిరీస్‌ గెలుచుకుంది. ఆదివారం జరగబోయే మ్యాచ్ కేవలం నామమాత్రమే. ఇందులో భారత్ ఓడినా పెద్దగా నష్టం లేదు. అయితే ఆఖరి మ్యాచ్​ను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని 13ఏళ్ల నాటి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. మరి ఈ రివేంజ్ ఏంటంటే?

భారత్- ఇంగ్లాండ్ జట్లు 13 ఏళ్ల తర్వాత ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు టీ20 ఫార్మాట్​లో చివరిసారిగా 2012లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక 13ఏళ్ల తర్వాత ప్రతిష్ఠాత్మకమైన వాంఖడే వేదికలో భారత్‌కి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్​లో ఎలాగైనా నెగ్గి సిరీస్​లో ఆధిక్యం పెంచుకోవడమే కాకుండా, అప్పటి ఓటమికి బదులు తీర్చుకోవాలని సూర్యసేన భావిస్తోంది.

గత రికార్డులు
పొట్టి ఫార్మాట్లో ఇంగ్లాండ్​పై భారత్​దే పైచేయిగా ఉంది. భారత్- ఇంగ్లాండ్ జట్లు ఇప్పటి వరకు 28 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాయి. అందులో భారత్ 16 సార్లు గెలుపొందగా, ఇంగ్లాండ్ 12 సార్లు విజయం సాధించింది.

భారత్‌ జట్టు అంచనా:సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ

ఇంగ్లాండ్ జట్టు అంచనా: ఫిల్​ సాల్ట్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), జాకబ్ బెతెల్, జామీ స్మిత్, ఆదిల్ రషీద్, జేమీ ఓవర్టన్, సాకిబ్ మహ్మద్‌, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్

ABOUT THE AUTHOR

...view details