India Vs Bangladesh Test : బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా తాజాగా జరిగిన రెండో టెస్టులోనూ టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ సేన 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.
మ్యాచ్ సాగిందిలా :
తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడగా, వర్షం కారణంగా మ్యాచ్ రెండు రోజుల పాటు రద్దయ్యింది. దీంతో ఫలితం ఎటువైవు వస్తుందో అన్న తరుణంలో బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేసి రోహిత్ సేన చెలరేగిపోయింది. దీంతో కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఓపెనర్ కమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ (8), ఇక రెండో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (6) విఫలమైనప్పటికీ, ఆ తర్వాత బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ (51), విరాట్ కోహ్లీ (29*) అద్భుతంగా రాణించారు. అయితే మరో మూడు పరుగులు అవసరం అన్న సమయంలో, యశస్వి జైస్వాల్ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత రిషభ్ పంత్‌తో (4*) కలిసి కోహ్లీ మరో వికెట్ కూడా పడనీయకుండానే జట్టును గెలిపించారు.