Manika Batra Tennis:ఇండియా టేబుల్ టెన్నిస్ ఐకాన్ మనిక బాత్రా తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. మంగళవారం విడుదలైన టేబుల్ టెన్నిస్ (ITTF World Table Tennis Championships) ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ 24కి చేరుకుంది. అంతకు ముందున్న 39వ స్థానం నుంచి ఏకంగా 15 స్థానాలు మెరుగుపర్చుచుకుంది. శ్రీజ అకులని అధిగమించి మరోసారి భారతదేశపు టాప్ ర్యాంక్డ్ ప్లేయర్‌గా స్టేటస్ పొందింది. అంతే కాదు 25 ఏళ్ల వయస్సులో, టాప్ 25 సింగిల్స్ ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. 2019లో 24వ ర్యాంక్ అందుకుని సత్యన్ జ్ఞానశేఖరన్ రికార్డు సృష్టించాడు. భారతీయుడు సాధించిన అత్యత్తమ సింగిల్స్ ర్యాంక్ ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు ఇదే ఫీట్‌ని మనిక బాత్రా రిపీట్ చేసింది.
స్మాష్ టోర్నమెంట్‌లో అదరహో:గతవారం సౌదీ అరేబియా స్మాష్ టోర్నమెంట్‌లో మనిక, అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనతోనే ఆమె మెరుగైన ర్యాంక్ అందుకుంది. టోర్నీలో ప్రపంచ నం.2, చైనాకు చెందిన ఒలింపిక్ పతక విజేత వాంగ్ మాన్యును మనిక ఓడించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించడానికి ప్రపంచవ్యాప్తంగా 14వ ర్యాంక్‌లో ఉన్న నినా మిట్టెల్‌హామ్‌ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన హీనా హయాటాతో పోటీపడి ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్
పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో, ఆచంట శరత్ కమల్, సీజన్‌డ్ క్యాంపెయినర్, మూడు స్థానాలు కోల్పోయాడు. అయితే 40వ ర్యాంక్‌లో అత్యధిక ర్యాంక్‌లో ఉన్న భారతీయుడిగా తన హోదాను నిలబెట్టుకున్నాడు. అదే సమయంలో, మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్ వరుసగా 62, 63వ స్థానాల్లో నిలిచారు.