Amit Rohidas Suspended:పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు షాక్ తగిలింది. డిఫెండర్ అమిత్ రొహిదాస్ ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురైయ్యాడు. అతడు ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హాకీ ఫెడరేషన్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘించాడని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH) పేర్కొంది. ఈ మేరకు అమిత్‌ను ఒక మ్యాచ్ సస్పెండ్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో అతడు ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. కాగా, మంగళవారం (ఆగస్టు 06) జర్మనీతో టీమ్ఇండియా తలపడనుంది. భారత్ ఈ మ్యాచ్‌లో 16కు బదులుగా 15మంది స్వ్కాడ్‌తోనే బరిలో దిగాల్సి ఉంటుంది.
హాకీ ఇండియా స్పందన
అయితే పారిస్ ఒలింపిక్స్‌లో పలు ఈవెంట్లలో ఫీల్డ్ అంపైర్లు తటస్థంగా వ్యవహరించట్లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లోనూ అదే జరిగిందని ఇండియా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై ఇండియా హాకీ స్పందించింది. 'ఇలాంటి ఘటనలతో ప్లేయర్ల కాన్ఫెడన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అధికారిక ప్రక్రియపై కోచ్‌లు, అభిమానులకు ఉన్న విశ్వాసాన్ని కూడా ఇవి దెబ్బతీస్తాయి. క్రీడా సమగ్రతను నిలబెట్టడానికి, భవిష్యత్‌లో జరగబోయే మ్యాచులనైనా సరిగ్గా జరిగేలా మున్ముందు సమీక్షించాలని ఒలింపిక్ సంఘాన్ని కోరుతున్నాం' అని హాకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఫుట్‌బాల్‌లో అయితే రెడ్ కార్డు అందుకున్న ఆటగాడిపై తర్వాతి మ్యాచ్ ఆడకుండా నిషేధం పడుతుంది. హాకీలో మాత్రం రూల్స్ వేరుగా ఉన్నాయి.