Asian Champions Trophy India Hockey :ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో దూకుడు ప్రదర్శనతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత జట్టు సెమీస్‌లో దక్షిణా కొరియా జట్టును 4-1 తేడాతో ఓడించింది. హర్మన్‌ప్రీత్ సేన 4-1 తేడాతో కొరియాపై విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ రెండు, ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ చెరో గోల్ చేశారు. కొరియా తరఫున ఏకైక గోల్‌ను జిహున్ యంగ్ చేశాడు.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ - ఫైనల్‌కు చేరిన భారత్ - Asian Champions Trophy Hockey - ASIAN CHAMPIONS TROPHY HOCKEY
Asian Champions Trophy India Hockey : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Asian Champions Trophy India Hockey (source IANS Photo)
Published : Sep 16, 2024, 5:19 PM IST
|Updated : Sep 16, 2024, 5:28 PM IST
ఇకపోతే టోర్నీలో మూడుసార్లు ఛాంపియన్‌గా అవతరించిన పాకిస్థాన్ జట్టుకు మరో సెమీస్‌లో చైనా గట్టి షాక్ ఇచ్చింది. మొదట మ్యాచ్ 1-1తో టై అయింది. దీంతో షూటౌట్ నిర్వహించగా, ఇందులో చైనా 2-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న చైనా ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Last Updated : Sep 16, 2024, 5:28 PM IST