Ind Vs Eng Third Test 2024 Kohli : వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు టెస్ట్‌లకు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. అతడు మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయమై కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కాగా, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. ఇందులో టీమ్ ఇండియా 106 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో తొలి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా నిలిపింది. ఇక ఈ విజయానంతరం మీడియా ప్రతినిథులతో మాట్లాడాడు రాహుల్ ద్రవిడ్. అప్పుడు మూడో టెస్ట్‌కు కోహ్లీ వస్తాడా? లేదా? అని ప్రశ్నించగా రాహుల్ ఈ విధంగా మాట్లాడాడు.
"కోహ్లీ వచ్చే విషయమై నా కన్నా సెలెక్టర్లను అడగడం ఉత్తమం అని నా అభిప్రాయం. త్వరలోనే వారు చివరి మూడు టెస్ట్‌లకు టీమ్‌ను అనౌన్స్ చేయనున్నారు. విరాట్ వచ్చే విషయమై నా కన్నా సెలెక్టర్లకే బాగా తెలుస్తుంది. కోహ్లీతో మేం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం" అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.
అంతకన్నా ముందు మూడో టెస్ట్ గురించి విరాట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు. "ఇప్పటి వరకు అయితే మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనని కోహ్లీ అయితే చెప్పలేదు. కేవలం తొలి రెండు మ్యాచ్‌లకు సంబంధించి మాత్రమే సమాచారం ఇచ్చాడు. అతడు ఏ సమాచారం ఇవ్వలేదంటే సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లే. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది." అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. ఇకపోతే చివరి మూడు టెస్ట్‌లకు సంబంధించి జట్టును మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
రెండో సారి తండ్రిగా ప్రమోషన్ : విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అందుకే ఆమెతో గడపాలని కోహ్లీ - బీసీసీఐ పర్మిషన్తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడని వార్తలు వస్తున్నాయి. అయితే కోహ్లీ తండ్రి కాబోతున్న విషయం రీసెంట్గా సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తెలిపారు. ఇకపోతే మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది.
బీసీసీఐ షాకింగ్ డెసిషన్- మూడో టెస్టుకు బుమ్రాకు దూరం!- ఎందుకంటే?
ఇంగ్లాండ్ సిరీస్‌తో ఇషాన్ రీ ఎంట్రీ- హింట్ ఇచ్చిన ద్రవిడ్!