తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో సిరీస్​ - గుబులు పుట్టిస్తున్న కోహ్లీ డెసిషన్​! - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోహ్లీ

IND VS ENG Test Series 2024 Kohli : ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో కోహ్లీ తీసుకుంటున్న నిర్ణయాలు ఫ్యాన్స్​కు రుచించడం లేదు. ఏం జరిగిందంటే?

ఇంగ్లాండ్​తో సిరీస్​ - గుబులు పుట్టిస్తున్న కోహ్లీ డెసిషన్​!
ఇంగ్లాండ్​తో సిరీస్​ - గుబులు పుట్టిస్తున్న కోహ్లీ డెసిషన్​!

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 7:44 AM IST

Updated : Feb 8, 2024, 10:23 AM IST

IND VS ENG Test Series 2024 Kohli : టీమ్​ ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టు మ్యాచులకు దూరమైన సంగతి తెలిసిందే. అదే సమయంలో తొలి రెండు మ్యాచుల్లోనూ బ్యాటర్ల నిలకడ లేమితో టీమ్​ ఇండియా జట్టు ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్​కైనా విరాట్​​ వస్తాడని అంతా ఆశించారు. కానీ ఇప్పుడతడు రావట్లేదని తెలిసింది. రాజ్‌కోట్‌, రాంచి వేదికగా జరిగే మూడు, నాలుగు మ్యాచుల్లోనూ అతడు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ధర్మశాలలో జరిగే చివరి టెస్టుకూ అతడు ఆడటం అనుమానమేనని సమాచారం అందింది. దీంతో అతడు సిరీస్‌ మొత్తానికి దూరం అవుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ తీసుకుంటున్న నిర్ణయాలు ఫ్యాన్స్​ను కాస్త నిరాశ పరుస్తున్నాయి. అదే సమయంలో అతడి నిర్ణయాన్ని వాళ్లు గౌరవిస్తున్నారు. అతడికి ఏమైందా అని కూడా ఆలోచిస్తున్నారు.

ఇకపోతే కోహ్లీ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ఈ మధ్య వార్త వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే అతడు అందుబాటులో లేడని ప్రచారం సాగుతోంది. దీనిపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ - "ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో ఆటగాడికి బీసీసీఐ ఎప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుంది. ఎప్పుడు అందుబాటులోకి రావాలన్నది పూర్తిగా ఆ ప్లేయర్​దే డెసిషన్. ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారం ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో విరాట్‌ ఆడటం సందేహమే" అని చెప్పారు.

ఇకపోతే మొదటి టెస్టులో ఓటమిని అందుకున్న టీమ్​ఇండియా రెండో టెస్టులో గెలుపొంది సిరీస్‌ను సమం చేసింది. మిగతా మూడు టెస్టుల మ్యాచ్​ కోసం ఈ వారంలో సెలక్టర్లు టీమ్​ను ఎంపిక చేయనున్నారు. ఇందులో విరాట్​ గైర్హాజరీపై కూడా డిస్కస్ చేయనున్నారు. రెండో టెస్టుకు రెస్ట్ తీసుకున్న పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మూడో మ్యాచ్​లో ఆడతాడు. గాయాలతో జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా కూడా మూడో మ్యాచ్​లో ఆడే అవకాశాలున్నాయి. రెండో టెస్టులో అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో జట్టును గెలిపించిన బుమ్రా మూడో టెస్టుకు విశ్రాంతి తీసుకోనున్నాడని అంటున్నారు.

మూడో టెస్ట్​ రాజ్‌కోట్‌ (ఈనెల 15-19), నాలుగో టెస్ట్​ రాంచి (23-27), ఐదో టెస్ట్​ ధర్మశాల (మార్చి 7-11) జరగనున్నాయి.

చరిత్ర సృష్టించిన బుమ్రా- టీమ్​ఇండియా నుంచి తొలి పేసర్​గా రికార్డ్​

ఐపీఎల్ 2024 : అనుష్క శర్మ వర్సెస్ రితికా- హాట్​ టాపిక్​ ఇదే​!

Last Updated : Feb 8, 2024, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details