Ind Vs Eng T20 Series :ఆస్ట్రేలియా సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమ్ఇండియా బుధవారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్‌లో రెండో మ్యాచ్ శనివారం జరగనుంది. ఈ క్రమంలో క్రీడాభిమానుల కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం కల్పించనున్నట్లు తాజాగా వెల్లడించింది.
టికెట్లు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకు వినియోగించుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రెండో టీ20 కోసం టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. 2023 ఐపీఎల్ సీజన్‌లోనూ చెన్నైలో జరిగిన మ్యాచ్‌లకు ఇలానే మెట్రో సేవలను ఉచితంగా అందించింది. చెపాక్ చుట్టుపక్కల ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఇలాంటి వెసులుబాటు కల్పించింది.
"మ్యాచ్ టికెట్లు ఉన్న ప్రేక్షకులు మెట్రో రైళ్లలో ఆ రోజున ఉచితంగా ప్రయాణాలు చేయొచ్చు. చెపాక్‌కు వచ్చేందుకు మీ ట్రావెల్‌ను ప్లాన్ చేసుకోండి" అని సోషల్ మీడియా వేదికగా తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ వెల్లడించింది.
గతేడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా చెన్నైలో అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదికైంది. అప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో భారత్ పోటీ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ పొట్టి కప్ కోసం వల్ల తమిళనాడులోకి అడుగుపెట్టింది టీమ్ఇండియా. అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అటు వీకెండ్ కావడం కూడా టికెట్లు త్వరగా అయిపోవడానికి ఓ కారణమంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.