Ind Vs Eng 2024 Test Series :హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగాటీమ్ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 64.3 ఓవరల్లో 246 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (88 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. అయితే స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత స్పిన్నర్లు విజృంభించారు. ఎనిమిది వికెట్లు వారికే దక్కాయి. భారత బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 3, అక్షర్ పటేల్ 2, జస్‌ప్రీత్ బుమ్రా 2 వికెట్ పడగొట్టారు. జానీ బెయిర్‌స్టో (37), బెన్ డకెట్ (35), జో రూట్ (29) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అరంగేట్రం ఆటగాడు టామ్ హార్ట్‌లీ 24 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు రెండో సెషన్‌లో మరింత తడబడుతూ ఆడింది. లంచ్ బ్రేక్ తర్వాత ఐదు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. అలా 215/8 స్కోరుతో చివరి సెషన్‌ను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు మరో 31 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది.