Ind vs Eng 1st Test 2024:ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం భారత్ 190 పరుగుల లీడ్‌లో ఉంది. ఓవర్‌నైట్ స్కోర్ 421-7తో మూడో ఆట బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా మరో 15 పరుగులే జోడించి మూడు వికెట్లు కోల్పోయింది. జడేజా (87 పరుగులు), అక్షర్ పటేల్ (44 పరుగులు) చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ 4, టామ్ హార్ట్లీ 2, రెహన్ అహ్మద్ 2, జాక్ లీచ్ 1 వికెట్ దక్కించుకున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (80), రవీంద్ర జడేజా (87 పరుగులు), కేఎల్ రాహుల్ (86 పరుగులు) హాఫ్ సెంచరీలతో మెరవగా, శ్రీకర్ భరత్ (41 పరుగులు), అక్షర్ పటేల్ (44 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (35) రాణించారు. తొలి రోజు జైశ్వాల్ ఆకట్టుకోగా, రెండో రోజు రాహుల్, జడేజా అద్భుతంగా ఆడారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (24 పరుగులు), యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (23 పరుగులు), రవిచంద్రన్ అశ్విన్ (1) విఫలమయ్యారు. చివర్లో బుమ్రా (0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.