Gambhir First Impression On Dhoni :టీమ్ ఇండియాకు దిగ్గజ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్ ప్రాతినిథ్యం వహించారు. వీరిద్దరూ కలిసి భారత జట్టుకు చాలా విజయాలను అందించారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ, గౌతీ 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే మహీ, గంభీర్ ఇద్దరు ఆన్ ఫీల్డ్, ఆఫ్ పీల్ట్ కూడా మంచి మిత్రులే. ఇటీవలే ఓ షోలో పాల్గొన్న భారత జట్టు హెచ్ కోచ్ గంభీర్ తనకు ధోనీపై ఏర్పడిన ఫస్ట్ ఇంప్రెషన్‌ను, అతడితో ఉన్న స్నేహా బంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
పాకిస్థాన్ పై ధోనీ విధ్వంసం -ధోనీ, తాను ఇండియా ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించామని గంభీర్ చెప్పుకొచ్చాడు. మహీ మొదటిసారి గ్లౌవ్స్ వేసుకోని కీపింగ్ చేయడం, బ్యాటింగ్ ఇంకా తనకు గుర్తుందని తెలిపాడు. ముక్కోణపు సిరీస్‌లో ధోనీ పాకిస్థాన్ ఏ జట్టుపై రెండు సెంచరీలు, ఒక అర్ధ శతకం బాదాడని పేర్కొన్నాడు. ధోనీ అద్భుతమైన నాక్స్ వల్ల అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడని వివరించాడు.
"ఇండియా ఏ జట్టు తరఫున ధోనీ, నేను కెన్యా, జింబాబ్వే పర్యటనకు వెళ్లాము. పాకిస్థాన్ ఏ, కెన్యాతో ముక్కోణపు సిరీస్ ఆడాం. ధోనీ బలంగా బంతిని కొట్టగలడని, వికెట్‌ను కాపాడుకుని భారీ హిట్టింగ్ చేయగలడని జట్టు సభ్యులందరికీ తెలుసు. మహీ కీపింగ్, బ్యాటింగ్ స్కిల్స్ చూసి భయపడ్డాను. అప్పుడే ధోనీపై ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడింది. అప్పటికే టీమ్ ఇండియాకు వికెట్ కీపర్లు ఉన్నారు. అయితే 100 మీటర్ల దూరంలో సిక్సర్లు కొట్టగలిగే హార్డ్ హిట్టర్లు లేరు. ధోనీ అద్భుతమైన ఆటగాడు." అని గంభీర్ వ్యాఖ్యానించాడు.