IND VS BAN First Test Chepak Stadium Pitch : టీమ్ ఇండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. దాదాపు ఆరు నెలల గ్యాప్ తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. మరో రోజులో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సొంత గడ్డపై చెన్నై వేదికగా ఈ సిరీస్ ఆరంభం కాబోతోంది.
అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే సాధారణంగా ఆ జట్టుపై తక్కువ అంచనాలు ఉంటాయి. అయితే రీసెంట్గా పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై ఓడించింది బంగ్లా. ఈ సంచలన విజయంలో కీలక పాత్ర బంగ్లా స్పిన్నర్లదే. దీంతో స్పిన్‌కు బాగా అనుకూలంగా ఉండే చెన్నై పిచ్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగే అవకాశ ముందని అంతా భావిస్తున్నారు. భారత బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారు.
సాధారణంగా ఎప్పుడూ ప్రత్యర్థి జట్లను స్పిన్ బలంతోనే టీమ్‌ఇండియా దెబ్బ కొడుతుంటుంది. కానీ ఇప్పుడు చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే బంగ్లా బౌలర్లు కూడా ఆ పిచ్‌ను బాగా ఉపయోగించుకుని భారత బ్యాటర్లకు చెక్ పెట్టే అవకాశముంది.
ఈ నేపథ్యంలో చెపాక్ పిచ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి క్రికెట్ ప్రియుల్లో నెలకొంది. అయితే ప్రస్తుతం చెన్నైలో వాతావరణం పొడిగా ఉండి, బాగా ఎండలు కాస్తున్నాయి. పిచ్‌పై పచ్చిక కూడా ఉంది. కాబట్టి మ్యాచ్ సమయానికి పచ్చికను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం చేసే ఛాన్స్ ఉంది. పిచ్ మరీ పొడి బారితే రెండో రోజుకే పగుళ్లు వచ్చి బంతి విపరీతంగా తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత పొడి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పిచ్‌ను తడుపుతున్నట్లు సమాచారం.
ఏదైమైనా చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినా, మరీ బంతి గింగిరాలు తిరిగేలా మాత్రం ఉండకపోవచ్చని తెలుస్తోంది. బ్యాలెన్స్డ్గా ఉండేలా వికెట్‌ను రెడీ చేస్తున్నారట. "గత రెండు వారాలుగా చెన్నైలో వేడి వాతావరణం ఉంటోంది. టెంపరేచర్ 30 డిగ్రీలకుపైనే ఉంటుంది. అందుకే పిచ్‌ను నీళ్లతో తడుపుతున్నారు. మ్యాచ్ ముందుకు సాగే కొద్ది స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుంది. బ్యాటర్లు స్పిన్‌ను కాచుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి" అని ఓ సీనియర్ క్యురేటర్ పేర్కొన్నాడు.
గంభీర్‌కు మొదలైన అసలు 'టెస్టు' - ఆ బాధ్యత మనోడిదే! - IND VS BAN Gambhir Strategy
భారత కామెంటేటర్‌లకే ఎక్కువ ఇన్‌కమ్! ఒక్క మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే? - Cricket Commentators Salary