IND Vs BAN 2nd Test :కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్, జడేజా మెరుపులకు బంగ్లా ఆఖరి రోజు ఆటలో వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ గేమ్‌లో అశ్విన్, జడేజా, బుమ్రా మూడేసి వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ మాత్రం ఒక వికెట్‌ను పడగొట్టాడు. దీంతో భారత్ లక్ష్యం 95 పరుగులుగా మారింది.
భారత స్పిన్‌కు బంగ్లాదేశ్ ధీటుగా పోరాడింది. తొలి ఇన్నింగ్స్‌లో నాటౌట్ సెంచరీ చేసిన మోమినుల్ హక్ రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగుల వద్ద అశ్విన్ వికెట్ కోల్పోయాడు. లెగ్‌సైడ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. మిగతా ఆటగాళ్లంతా తక్కువ పరుగులు స్కోర్ చేసి ఔటయ్యారు. ముజ్ఫికర్ రహీమ్ (37) మాత్రమే చివరి వరకు పోరాడి జట్టును ఆదుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ 146 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.
అయితే ఖలెద్ (5*)తో కలిసి దాదాపు ఆరు ఓవర్ల పాటు వికెట్ ఇవ్వలేదు. దీంతో లంచ్ బ్రేక్ సమయాన్ని పొడిగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ముష్ఫికర్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసి బంగ్లా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.