Ind vs Ban 1st T20 :బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ జట్టు టీ20 సిరీస్‌పై కన్నేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 06) గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఐపీఎల్‌లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి అందరి దృష్టిని ఆకర్షించిన 22 ఏళ్ల మయాంక్ యాదవ్ ఈ సిరీస్‌లోనే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. మరో దిల్లీ పేసర్ హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ కూడా ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
ఇటీవల టీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలి మ్యాచ్‌లోనే బరిలోకి దిగే అవకాశముంది. జింబాబ్వే సిరీస్‌లో శతకంతో అదరగొట్టిన అభిషేక్ శర్మతో కలిసి వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. రియాన్ పరాగ్ ఐపీఎల్ తర్వాత ఆరు టీ20లు ఆడినప్పటికీ ఆ తరహా ఫామ్‌ను పునరావృతం చేయలేకపోయాడు. మంచి ప్రదర్శన చేసేందుకు అతడికి ఈ సిరీస్ మరో అవకాశం కానుంది. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో చోటుదక్కని వరుణ్ చక్రవర్తికి బంగ్లాదేశ్‌తో సిరీస్ పునారాగమనంగా కనిపిస్తోంది. మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌లో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
టెస్టు సిరీస్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఆడిన వారిలో ఎక్కువ మంది టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడం, బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ ఓటమి ప్రభావం అంతగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20 క్రికెట్‌కు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం బంగ్లాకు తీరని లోటు కానుంది. షాంటో నేతృత్వలోని బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. గ్వాలియర్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.అక్కడ కొత్తగా నిర్మించిన శ్రీమంత్ మాధవరావ్ సింధియా స్టేడియం తొలి మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది.
తుది జట్లు (అంచనా)