ICC Test Rankings :తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుని ఇటీవలే ద్విశతకం సాధించిన స్టార్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌తో తన పాయింట్స్‌ను మెరుగుపరుచుకుని టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 14వ స్థానాలు పైకి ఎగబాకి 15వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.
రాజ్‌కోట్ టెస్టుకు ముందు 29వ ర్యాంకులో ఉన్న జైస్వాల్, తాజాగా జరిగిన మ్యాచ్‌లో ద్విశతకాన్ని సాధించి 15వ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం జైస్వాల్ వద్ద 699 పాయింట్లు ఉన్నాయి. అయితే టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కేవలం రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. ప్రస్తుతం 752 పాయింట్లతో విరాట్ 7వ స్థానంలో ఉన్నాడు.
మరోవైపు టీమ్ఇండియా సారథి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా టెస్టులో 88 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ 12 స్థానాలు మెరుగుపరుచుకుని 13వ ర్యాంక్‌ను సాధించాడు. ఇక ఇదే వేదికగా సెంచరీ సాధించిన టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 7 స్థానాలు ఎగాబాకి 34వ ర్యాంక్‌ను అందుకున్నాడు. అయితే ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మాత్రం టాప్ పొజిషన్లో ఉన్నాడు.