ICC Test Ranking 2024:ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్ కెరీర్ బెస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలతో అదరగొట్టిన జైశ్వాల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 12వ ప్లేస్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 727 రేటింగ్స్‌తో ఉన్నాడు. మరో బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (616 రేటింగ్స్) నాలుగు స్థానాలు ఎగబాకి 31వ ప్లేస్‌కు చేరుకున్నాడు. నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన టీమ్ఇండియా బ్యాటర్ ధ్రువ్ జురెల్ (461 రేటింగ్స్) ఏకంగా 31 స్థానాలు మెరుగుపర్చుకొని 69 ప్లేస్‌లో ఉన్నాడు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (720 రేటింగ్స్) 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ (744 రేటింగ్స్) దూరంగా ఉన్నప్పటికీ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. టీమ్ఇండియా నుంచి టాప్- 10లో ఉన్న బ్యాటర్ విరాట్ ఒక్కడే కావడం విశేషం. ఇక న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 893 రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉండగా, ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (818 రేటింగ్స్) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
టాప్- 5 బ్యాటర్లు (టెస్టు)
- కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 893 రేటింగ్స్
- స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 818 రేటింగ్స్
- జో రూట్ (ఇంగ్లాండ్)- 799 రేటింగ్స్
- డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)- 780 రేటింగ్స్
- బాబర్ అజామ్ (పాకిస్థాన్)- 768 రేటింగ్స్
ఇక టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 867 రేటింగ్స్‌తో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (846 రేటింగ్స్) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా (785 రేటింగ్స్) ఆరో స్థానం దక్కించుకున్నాడు. కాగా, టాప్- 10లో టీమ్ఇండియా నుంచే ముగ్గురు ప్లేయర్లు ఉండడం విశేషం.