Champions Trophy Without India: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించకపోవడం వల్ల టోర్నమెంట్ పాకిస్థాన్ నుంచి సౌతాఫ్రికాకు షిఫ్ట్ అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ లేకుండానే టోర్నీని నిర్వహించాలని పీసీబీ ఆలోచిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఐసీసీకి పీసీపీ ప్రతిపాదనలు కూడా పంపిందని సమాచారం.
అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే సాహసం చెయ్యదు! ఐసీసీ ఈవెంట్ ఏదైనా టీమ్ఇండియానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. అదే టోర్నమెంట్లో భారత్ లేకపోతే రెవెన్యూ భారీగా పడిపోతుంది. భారత్ కాకుండా ఇతర మ్యాచ్‌లకు స్టేడియాలు కూడా సరిగ్గా నిండవు. క్రీడా విశ్లేషకుల మాట కూడా ఇదే.
ఇక భారత్ లేని టోర్నమెంట్‌కు వ్యూవర్షిప్ కూడా అంతంతే ఉంటుంది. ప్రసారకర్తలకు కూడా ఇది ఒక రకమైన ఆర్థిక ఇబ్బందే. స్పాన్సర్‌షిప్‌లు కూడా ఉండవు. ఓవరాల్‌గా టీమ్ఇండియా లేకపోతే ఐసీసీ టోర్నీయే లేదు. ఒకవేళ భారత్ లేకుండా టోర్నీని నిర్వహించేయవచ్చని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే క్రికెట్ హిస్టరీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్- 10 మ్యాచ్‌లు టీమ్ఇండియావే కావడం విశేషం. అందులో 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ భారత్- శ్రీలంక మ్యాచ్‌కు అత్యధికంగా 558 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరి లిస్ట్‌లో ఇంకా ఏయే మ్యాచ్‌లు ఉన్నాయో ఒక లుక్కేయండి.