2024 Womens T20 World Cup Song :2024 మహిళల టీ20 వరల్డ్‌కప్ సాంగ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం లాంఛ్ చేసింది. ఈ పాటను మైకీ మెక్క్లర్క్, పార్త్ పరేఖ్ కంపోజ్ చేయగా, ఇండియన్ సింగర్ బాండ్ విష్ (Band W.i.S.H) గ్రూప్ పాడింది. 1.40 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో మహిళల వరల్డ్‌కప్‌లో గతంలో జరిగిన మూమెంట్స్‌ను చూపించారు. మరి మీరు ఆ పాట విన్నారా?
కాగా, ఈ ప్రతిష్ఠాత్మకమైన ట్రోర్నమెంట్ అక్టోబర్ 03 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబరు 28- అక్టోబర్ 1 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీకి దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది.
2 స్టేడియాల్లో మ్యాచ్‌లు
ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న దుబాయ్ ఇంటర్నేషల్ స్టేడియం 2009లో ప్రారంభమైంది. ఇందులో 25,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. అలాగే 1982లో నిర్మితమైన షార్జా క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 200కు పైగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు జరిగాయి. దక్షిణాసియాలో ఈ స్టేడియం బాగా ప్రాచుర్యం పొందింది.
భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ
2024 టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచింది. 7,958,080 అమెరికా డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో రూ.66 కోట్లకు పైమాటే. దీంతో విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీ కూడా పెరిగింది. గతేడాది జరిగిన టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవగా ఆ జట్టుకు 1 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అదే ఈసారి ఈ ప్రైజ్ మనీని 2.34 మిలియన్ డాలర్లకు పెంచారు. అంటే ఏకంగా 134 శాతం పెరిగింది. భారత కరెన్సీలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విన్నర్‌కు దాదాపు రూ.19 కోట్లకు పైగా ప్రైజ్ మనీ అందుతుంది.