Sanju Samson ICC Champions Trophy 2025 :ఈ ఏడాదికిగానూ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ టీమ్ఇండియా తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం జనవరి 12 కల్లా ప్రకటించాల్సింది. కానీ, టీమ్‌ఇండియా కోరిక మేరకు ఈ వారంతం వరకు టైమ్ ఇచ్చింది. అప్పుడు టీమ్‌ను వెల్లడించినప్పటికీ ఫిబ్రవరి 13 వరకు ఏదైనా మార్పులు ఉంటే చేసుకొనే అవకాశాలు ఉన్నాయి.
అయితే జనవరి 19న బీసీసీఐ సెలక్టర్లందరూ స్క్వాడ్‌ను వెల్లడిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి సంజు శాంసన్‌పైనా పడింది. చివరిసారిగా వన్డేలో (సౌతాఫ్రికాపై) సెంచరీ సాధించి మంచి ఊపుమీద ఉన్నాడు ఈ స్టార్ క్రికెటర్. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తనను ఫస్ట్ ఫ్రిఫరెన్స్గా భావించట్లేదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అసలు తనను కనీసం స్క్వాడ్‌లోనైనా తీసుకునే అవకాశం రాకపోవచ్చనేది వారి మాట.
పంత్‌కు బ్యాకప్‌గా ఆ ఇద్దరూ?
ఇదిలా ఉండగా, రెగ్యులర్ వికెట్ కీపర్‌గా యంగ్ క్రికెటర్ రిషభ్ పంత్ జట్టులో ఉండటం ఖాయమే అని అనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు రెస్ట్ ఇచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ కల్లా రెడీగా ఉండేలా చూస్తారని తెలుస్తోంది. గత వన్డే ప్రపంచ కప్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. కానీ, ఈసారి మాత్రం తనను స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే తీసుకొనే అవకాశం ఉంది. అందుకే పంత్‌కు బ్యాకప్‌గా ఎవరిని ఎంచుకుంటారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆ పొజిషన్ కోసం ముగ్గురు రెడీగా ఉన్నారు. వారిలో సంజు శాంసన్‌తో పాటు ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్. దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ అదరగొట్టేయడంతో బీసీసీఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.