ICC T20 Worldcup 2024 Financial Fraud : ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల డీటైల్డ్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయించింది. టోర్నమెంట్ డెలివరీని రివ్యూ చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. కమిటీలో రోజర్ త్వోస్, లాసన్ నైడూ, ఇమ్రాన్ ఖ్వాజా ఉన్నారు. వారికి దర్యాప్తు చేయడానికి పూర్తి అధికారం ఇచ్చారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని, పేలవమైన పర్యవేక్షణతో ఇబ్బందులు తలెత్తాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
- ఆర్థిక అక్రమాలపై విచారణ
ఈ సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలనే నిర్ణయాన్ని ICC సభ్యులు ఏకగ్రీవంగా సమర్థించారు. యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్‌లో ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అందుకే ఈవెంట్‌కు సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్‌ను పరిశీలిస్తామని ఒక అధికారి పేర్కొన్నారు. - ICCలో నాయకత్వ మార్పులు
ఇటీవల, ఇద్దరు సీనియర్ ఐసీసీ అధికారులు క్రిస్ టెట్లీ, క్లైర్ ఫర్లాంగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. టెట్లీ ఈవెంట్స్‌ను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉండగా, ఫర్లాంగ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్‌ను హ్యాండిల్ చేశాడు. వీరు తప్పుకోవడంతో ఐసీసీ లీడర్‌షిఫ్ స్ట్రక్టర్లో మార్పులు రానున్నాయి. వారి రాజీనామాలకు కారణాలు ఇంకా తెలియలేదు. ఏదేమైనప్పటికీ వీరిద్దరు ఐసీసీ కోసం ఎన్నో ఏళ్ల పాటు కీలకమైన సేవలందించారు. - అవకతవకలు బయటపడితే రాజీనామాలు?
తాజాగా శ్రీలంకలోని కొలంబోలో ఐసీసీ నాలుగు రోజుల వార్షిక సదస్సు ముగిసింది. ఈ సమావేశంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC), ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీతో కీలక సమావేశాలు జరిగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దర్యాప్తులో ఆర్థిక అవకతవకలు బయటపడితే, దాని పర్యవసానాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయని ఐసీసీ సభ్యులు చెబుతున్నారు. ఐసీసీ చైర్ గ్రెగ్ బార్క్లే, సీఈఓ జెఫ్ అల్లార్డిస్ సహా ఐసీసీ లీడర్‌షిప్‌లోని అత్యున్నత స్థాయి పదువుల్లో ఉన్నవారి రాజీనామాలకు దారితీయవచ్చని అంటున్నారు.
కేంద్ర బడ్జెట్- క్రీడలకు రూ.3,442 కోట్లు