తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- వరల్డ్​కప్​ మ్యాచ్​లకు వారికి ఫ్రీ ఎంట్రీ - T20 World Cup 2024

T20 World Cup 2024 Free Entry: 2024 వరల్డ్​కప్​ టోర్నమెంట్​కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టికెట్ ధరలు నిర్ణయించింది.

T20 World Cup 2024
T20 World Cup 2024 (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 11, 2024, 7:13 PM IST

Updated : Sep 11, 2024, 8:13 PM IST

T20 World Cup 2024 Free Entry:2024 వరల్డ్​కప్​ టోర్నమెంట్​కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ 03న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ ప్రారంభం కానుంది. దుబాయ్, షార్జా వేదికలుగా ఈ టోర్నీని గ్రాండ్​గా నిర్వహించేందకు ఐసీసీ ప్లాన్ చేస్తోంది. అయితే టోర్నీలో మ్యాచ్​లకు సంబంధించిన టికెట్ ధరలను ఐసీసీ బుధవారం వెల్లడించింది. ఈ క్రమంలోనే యంగ్ క్రికెట్ ఫ్యాన్స్​కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులకు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.

రూ 115కే టిక్కెట్
ఇక మ్యాచ్ టికెట్ ధరను కూడా చాలా తక్కువగా నిర్ణయించింది. కేవలం 5 దుబాయ్ దిర్హమ్స్​గా ధరను నిర్ణయించింది. అంటే రూ.115 కే స్టేడియంలో ​మ్యాచ్ చూసే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది. మహిళల క్రికెట్​కు సైతం క్రేజ్ తీసుకురావడంలో భాగంగా ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దుబాయ్ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్​పై వరల్డ్​కప్ లేజర్ షో ప్రదర్శించింది.

అందరికీ హోమ్‌ గ్రౌండే!
అయితే ఈ T20 ప్రపంచ కప్ టోర్నీకి బంగ్లాదేశ్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్‌లో ఇటీవల రాజకీయ సంక్షోభం, అల్లర్లు మొదలవ్వడం వల్ల ఐసీసీ వేదికను మార్చాల్సి వచ్చింది. చివరికి టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు యూఏఈ ముందుకొచ్చింది. అక్టోబర్ 3న బంగ్లాదేశ్ వర్సెస్‌ స్కాట్లాండ్ మ్యాచ్‌తో మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.

మీడియా సమావేశంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ అలెర్డైస్ మాట్లాడారు. 'టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లకు UAE హోమ్​గ్రౌండ్ లాంటింది. ప్లేయర్లందరూ ఇక్కడి ఫ్యాన్స్‌ సపోర్ట్‌ ఎంజాయ్‌ చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టిక్కెట్ ధర కేవలం 5 దిర్హామ్‌లుగా నిర్ణయించాం. ఇక 18ఏళ్లలోపు వారికి ఫ్రీ ఇస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను' అని పేర్కొన్నారు.

టిక్కెట్‌లు ఎలా కొనాలి?
దుబాయ్, షార్జాలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన టిక్కెట్ ధరలను మాత్రమే బోర్డు అధికారులు ప్రకటించారు. టిక్కెట్‌లను ఎలా కొనుగోలు చేయాలనే వివరాలను వారు షేర్‌ చేయలేదు. టిక్కెట్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అభిమానులు క్రమం తప్పకుండా ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేయాలి. టిక్కెట్లు త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

యూఏఈలో మహిళల టీ20 ప్రపంచకప్‌ - పూర్తి షెడ్యూల్ ఇదే - ICC Womens T20 World Cup

భారత్ అందుకే ఆతిథ్యం ఇవ్వట్లేదు - టీ20 మహిళా ప్రపంచకప్​ విషయంలో జై షా క్లారిటీ ఇదే! - T20 Womens World Cup 2024

Last Updated : Sep 11, 2024, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details