Virat Kohli Ranji Career:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ గురువారం రైల్వేస్‌తో మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఈ మేరకు రెండు రోజులుగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. అయితే ఫామ్‌లేమితో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న విరాట్, దేశవాళీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, దాదాపు 12ఏళ్ల తర్వాత విరాట్ డొమెస్టిక్ క్రికెట్ ఆడనున్నాడు. దీంతో అందరి కళ్లు ఈ సీనియర్ ఆటగాడిపైనే ఉన్నాయి. ఈ క్రమంలో విరాట్ రంజీల్లో ఎప్పుడు అరంగేట్రం చేశాడు. ఎన్ని పరుగులు సాధించాడు. ఆఖరిసారిగా బరిలోకి ఎప్పుడు దిగాడు? అసలు విరాట్ రంజీ రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ విషయాలు మీకు తెలుసా?
అరంగేట్రం
2006 నవంబర్‌లో విరాట్ దిల్లీ తరఫున రంజీలో ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడుపై ఆడిన తొలి మ్యాచ్‌లో 10 పరుగులు బాదాడు. ఇక 2007-08 సీజన్లో విరాట్ తొలిసారి రంజీలో సెంచరీ సాధించాడు. రాజస్థాన్‌పై ఆడిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 19 రన్స్‌కు పెవిలియన్ చేసిన విరాట్, రెండో ఇన్నింగ్స్‌లో 106 పరుగులు చేశాడు. ఇక కెరీర్లో ఆఖరిసారిగా రంజీ మ్యాచ్ 2012లో ఉత్తర్‌ప్రదేశ్‌తో ఆడాడు.