Hardik Pandya Mumbai Indians : ఐపీఎల్ 2025 మెగా వేలం త్వరలో జరగనుంది. అయితే ఈ వేలంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను విడిచిపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌ను రాయల్ ఛాలెంజర్స్(ఆర్సీబీ) జట్టు దక్కించుకోకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ హార్దిక్‌ను ముంబయి ఎందుకు వదులుకోవాలనుకుంటోంది? తదితర విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం.
తిరిగి సొంత గూటికి
ఐపీఎల్లో చాలా ఏళ్ల పాటు ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ ప్రాతినిధ్యం వహించాడు. కొన్ని సీజన్ల ముందు ముంబయిని విడిచిపెట్టి, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. మళ్లీ గతేడాది సొంతగూటికి చేరాడు. దీంతో హార్దిక్ ముంబయి జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అప్పటి ముంబయి కెప్టెన్ రోహిత్‌ను తప్పించి, పాండ్యకు అవకాశం ఇవ్వడంపై అభిమానులు ఫైరయ్యారు. క్రికెట్ పండితులు సైతం హార్దిక్ ట్రాక్ రికార్డు అంత గొప్పగా లేదని అభిప్రాయపడ్డారు. అయితే హార్దిక్‌పై నమ్మకంతో కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది యాజమాన్యం. గత సీజన్లో ముంబయి ఆశించనమేర రాణించలేకపోయింది. ఘోరంగా విఫలమైంది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఆర్సీబీలోకి హార్దిక్
ముంబయి ఇండియన్స్ ఈ ఏడాది వేలంలో హార్దిక్‌ను వదులుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా చేస్తే హార్దిక్ ఆర్సీబీ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడట. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం ఉందన్న విషయం తేలాల్సి ఉంది. ఈ ఊహాగానాలపై హార్దిక్, లేకుంటే ముంబయి యాజమాన్యం స్పందించి చెక్ పెట్టాల్సి ఉందని అభిమానుల మాట.
ముంబయి పక్కా ప్లాన్!
ముంబయి ఇండియన్స్ ఆటగాళ్ల కొనుగోళ్ల విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. హార్దిక్ పాండ్యను తిరిగి జట్టులోకి తీసుకురావడం వెనుక పెద్ద ప్లానే ఉంది. భవిష్యత్ కెప్టెన్‌గా హార్దిక్ పనికొస్తాడని యాజమాన్యం నమ్మకం. పాండ్య నాయకత్వ లక్షణాలు, జట్టు నడిపించే తీరు, యువ క్రికెటర్లను ప్రోత్సహించే తీరు వంటివి నచ్చి అతడికి కెప్టెన్‌గా అవకాశాలిచ్చినట్లు తెలుస్తోంది.