Glenn Maxwell T20 Record :ఆడిలైడ్ వేదికగా వెస్డిండీస్‍తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్స్ మ్యాక్స్‌వెల్ మరోసారి మైదానంలో చెలరేగిపోయాడు. బాల్‌ను బౌండరీలు దాటించి అందరినీ ఔరా అనిపించాడు.
అయితే ఈ సెంచరీతో మ్యాక్సీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 55 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 120 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. అలా భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (5 శతకాలు) రికార్డును మ్యాక్సీ సమం చేశాడు.
143 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 151 మ్యాచ్‍ల్లో 5 సెంచరీలు చేస్తే, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 94 ఇన్నింగ్స్ 101 మ్యాచుల్లో ఈ మార్క్ చేరుకున్నాడు. ఇక ఈ లిస్ట్‌లో టీమ్ఇండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. అతడు 57 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు చేసి రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.
మ్యాక్సీ మార్క్ - 109 మీటర్లపైకి సిక్సర్
ఇక ఇదే మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఓ మాన్‍స్టర్ సిక్స్ కొట్టాడు. అది ఏకంగా 109 మీటర్ల దూరానికి ఓ సిక్స్ బాదేశాడు. విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ వేసిన 12 ఓవర్లోని రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. దీంతో బంతి రెండో స్టైర్ స్టాండ్స్‌లో పడింది. అలా ఏకంగా 109 మీటర్ల దూరనికి వెళ్లింది.