Glenn Maxwell IPL 2025 :రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్పందించాడు. రిటెన్షన్స్ పట్ల ఆర్సీబీ యాజమాన్యం తనకు సర్దిచెప్పిందని అన్నాడు. ఆ పరిస్థితులను వాళ్లు హ్యాడింల్ చేసిన విధానం తనకు నచ్చిందని తెలిపాడు. అలాగే ఆర్సీబీతో తన ప్రయాణం ఇక్కడితో ముగిసిపోలేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
'రిటెన్షన్స్ నేపథ్యంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆండీ ఫ్లవర్, మో బొబాట్తో జూమ్ కాల్లో మాట్లాడాను. వాళ్లు నన్ను రిటెన్ చేసుకోకపోవడం గురించి మాట్లాడారు. అదొక మంచి ఫేర్వెల్ మీటింగ్‌లాగా అనిపించింది. దాదాపు 30నిమిషాలపాటు నా గేమ్ గురించి, ఆర్సీబీ ఫ్యూచర్ స్ట్రాటజీ గురించి చర్చించాము. దాని పట్ల నేను హ్యాపీగానే ఉన్నా' అని రీసెంట్గా ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడాడు.
'ఆర్సీబీ స్టాఫ్‌లో కూడా మార్పులు చేసింది. రిటెన్షన్స్‌కు వాళ్లకు కూడా ఓ ప్రాసెస్ ఉంటుంది. అది నేను అర్థం చేసుకోగలను. నన్ను అట్టిపెట్టుకున్నారో లేదో అని రిటెన్షన్స్ లిస్ట్ వచ్చే వరకు నేను కూడా ఆత్రుతగా ఉన్నాను. కానీ, ఫారిన్ ప్లేయర్ల రూల్ కూడా దీనికి కారణం అయ్యి ఉండవచ్చు. ఆర్సీబీతో నా జర్నీ ముగిసిందని నేను అనుకోవడం లేదు. మళ్లీ ఆ జట్టులో భాగం అవ్వడానికి ఇష్టపడతాను. ఆర్సీబీ తరఫున ఆడడాన్ని ఎంజాయ్ చేశాను' అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు.