తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈడెన్ గార్డెన్స్‌లో ఫేర్‌వెల్ - భారత కోచ్‌గా గంభీర్‌ ఫిక్స్​! - Gautam Gambhir Farewell - GAUTAM GAMBHIR FAREWELL

Gautam Gambhir Farewell : ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇప్పటి వరకూ మెంటార్‌గా ఉన్న గంభీర్‌ తాజాగా ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓ ఫేర్‌వెల్ వీడియో షూటింగ్‌ పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియోకు కేకేఆర్ ఫ్రాంచైజీకి ఎటువంటి సంబంధం లేదంటూ ఓ అధికారి తాజాగా వెల్లడించారు.

Gautam Gambhir Farewell
Gautam Gambhir (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 3:41 PM IST

Gautam Gambhir Farewell : ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇప్పటి వరకూ మెంటార్‌గా ఉన్న గంభీర్‌ తాజాగా ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓ ఫేర్‌వెల్ వీడియో షూటింగ్‌ పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియోకు కేకేఆర్ ఫ్రాంచైజీకి ఎటువంటి సంబంధం లేదంటూ ఓ అధికారి తాజాగా వెల్లడించారు.

" గంభీర్ తన అభిమానులకు ఓ వీడియో మెసేజ్ ద్వారా వీడ్కోలు చెప్పాలనుకున్నారు. అందుకోసం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ షూట్​ చేశాం" అని క్రికెట్ అసోసియేషన్‌ ఆఫ్ బెంగాల్ తరఫున హాజరైన ఓ అధికారి తెలిపారు. అయితే గంభీర్ PR టీమ్​ ఆ వీడియోను చిత్రీకరించింది. దీంట్లో కేకేఆర్ ఫ్రాంచైజీకి ఎటువంటి సంబంధం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే అందులో కేకేఆర్‌తో గంభీర్‌ ప్రయాణం, 2024లో ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా గంభీర్ వచ్చిన తర్వాత ఈ వీడియోని అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

టీమఇండియా హెడ్ కోచ్‌ బాధ్యతలను మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వదులుకున్న నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ వేట ప్రారంభించింది. ద్రవిడ్ కూడా తన కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత మళ్లీ రానంటూ చెప్పడం వల్ల బీసీసీఐ తన స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి వచ్చింది.

ఇటీవలే గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్‌ను కూడా ఈ కోచ్​ రేసులో భాగంగా ఇంటర్వ్యూ చేశారు. ఇద్దరి ఫలీతాలను సమీక్షించి ఇప్పటికే హెడ్ కోచ్ ఎంపికనుబీసీసీఐ దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.అపారమైన క్రికెట్ అనుభవంతో పాటు ఐపీఎల్‌లోనూ సక్సెస్​ఫుల్​ మెంటార్​గా ఉండటం వల్ల సెలక్టర్లు గౌతమ్ గంభీర్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, కోచ్‌గా బాధత్యలు అంగీకరించడానికి బీసీసీఐ ముందు గంభీర్‌ ఓ డిమాండ్‌ ఉంచినట్లు తెలుస్తోంది. సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమించే విషయంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ కోరినట్లు సమాచారం. ఇక ఈ విషయానికి బోర్డు కూడా ఓకే చెప్పిందట. దీంతో గంభీర్‌ సహాయక సిబ్బందిలోనే కాకుండా జట్టులోనూ మార్పులు చేస్తారని సమాచారం.

గతంలో గంభీర్ నియామకంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ కూడా స్పందించారు. ఆయన ఎంపిక సరైనదే అంటూ కామెంట్ చేశారు.

'కోచ్ పదవికి గంభీర్ అప్లై చేసుకున్నాడో లేదో తెలీదు. కానీ, కోచ్​గా గంభీర్ ఎంపికైతే మాత్రం అది మంచి నిర్ణయమే. ఆయన నిజాయితీపరుడు. ఐపీఎల్​లో కోల్​కతాను మెంటార్​గా విజయవంతంగా నడిపించారు. టీమ్ఇండియాకు హెడ్​కోచ్ అయ్యేందుకు అన్ని లక్షణాలు గంభీర్​కు ఉన్నాయి. కానీ, ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్​గా పని చేయడం, ఇంటర్నేషనల్ టీమ్​కు కోచ్​గా వ్యవహరించడం రెండూ భిన్నమైన పాత్రలు. భారత్ వంచి అత్యుత్తమ జట్టు విషయంలో ఇది ఇంకా ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. అయితే గౌతమ్‌ గంభీర్‌కు ఇలాంటి వాటిపై పూర్తి అవగాహన ఉంది. విరాట్, రోహిత్ వంటి స్టార్లను ఎలా డీల్‌ చేయాలనేది తెలుసు. డ్రెస్సింగ్‌ రూమ్‌ పరిస్థితులను త్వరగా అలవర్చుకుని కలిసిపోతాడు. తన ఉద్దేశాలే కాకుండా జట్టులోని సభ్యుల ఆలోచనలనూ రిగణనలోకి తీసుకుంటాడు. తప్పకుండా గొప్ప హెడ్‌ కోచ్‌ అవుతాడనడంలో సందేహం లేదు. కానీ, ఈ పదవిని తీసుకోవడానికి అతడు అంగీకరిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరం' అని గంగూలీ అన్నారు.

టీమ్​ఇండియా హెడ్​ కోచ్ పదవి - గంభీర్‌ పెట్టిన ఐదు కండీషన్లు ఇవే! - Team India Head Coach

హెడ్​ కోచ్​గా గంభీర్ ఫిక్స్​? ఆ కండీషన్​కు ఓకే చెప్తేనే! - Team India New Coach

ABOUT THE AUTHOR

...view details