తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెటర్స్ సాల్ట్, పెప్పర్, ఆనియన్స్, మస్టర్డ్​- ఇవేం పేర్లురా బాబు! - ENGLAND CRICKETERS NAMES

భిన్నంగా ఇంగ్లాండ్ క్రికెటర్ల పేర్లు- ఆహార పదార్ధాల పేర్లు ఉన్న క్రికెటర్లు వీరే!

England Cricketers Names Of Food Items
England Cricketers Names Of Food Items (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 7:08 PM IST

England Cricketers Names Of Food Items :సాల్ట్, పెప్పర్, లాంబ్, మస్టర్డ్, ఆనియన్స్ ఇవన్నీ ఆహార పదార్థాలు, కూరగాయలు పేర్లు అనుకుంటున్నారా? కాదండి ఇంగ్లాండ్ క్రికెటర్ల పేర్లు. ఇంగ్లాండ్ జట్టులోని ఐదుగురు ప్లేయర్లకు ఆహార పదార్థాల పేర్లు ఉన్నాయి. వారి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫిలిప్ సాల్ట్
ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్ వైట్ బాల్ క్రికెట్​లో అదరగొడుతున్నాడు. 2021లో పాకిస్థాన్​పై తొలి వన్డే ఆడాడు. ఇప్పటివరకు ఫిలిప్ సాల్ట్ తన కెరీర్ లో 24 వన్డేలు ఆడి 715 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. 33 టీ20ల్లో 944 రన్స్ చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో ఫిలిప్ సాల్ట్ సభ్యుడు. వికెట్ కీపర్ కూడా. అలాగే ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్‌ కతా నైట్ రైడర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. 12 మ్యాచుల్లో 182 స్ట్రైక్ రేట్‌ తో 435 పరుగులు చేసి జట్టు కప్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

గ్రాహం ఆనియన్స్
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రాహం ఆనియన్స్ 2009లో వెస్టిండీస్​పై అరంగేట్రం చేశాడు. తన కెరీర్​లో 9 టెస్టుల్లో 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. అలాగే 4 వన్డేల్లో నాలుగు వికెట్లు తీశాడు. వెన్ను గాయం కారణంగా గ్రాహం ఆనియన్స్ 2020లో అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు.

మైఖేల్ పెప్పర్
మైఖేల్ పెప్పర్ ఇంగ్లాండ్ యంగ్ క్రికెటర్. విండీస్​తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్​కు ఎంపికయ్యాడు. మైఖేల్ పెప్పర్ 25 ఫస్ట్‌ క్లాస్ మ్యాచుల్లో రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. మొత్తంగా 946 పరుగులు చేశాడు. కాగా, విండీస్ సిరీస్​లో తానేంటో నిరూపించుకోవాలని మైఖేల్ పెప్పర్ తహతహలాడుతున్నాడు.

ఫిల్ మస్టర్డ్
ఫిల్ మస్టర్ట్ ఇంగ్లాండ్ తరఫున 10 వన్డేలు ఆడి, 233 రన్స్ చేశాడు. అలాగే 2 టీ20ల్లో 60 పరుగులు బాదాడు. అలాగే 210 ఫస్ట్-క్లాస్ మ్యాచుల్లో 8,700 రన్స్ చేశాడు. అందులో 7 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

అలన్ లాంబ్
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలన్ లాంబ్ దక్షిణాఫ్రికాలో జన్మించాడు. కానీ ఇంగ్లీషు జట్టు తరఫున క్రికెట్ ఆడాడు. 79 టెస్టులు ఆడిన లాంబ్ 36.09 సగటుతో 4,656 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే 122 వన్డేల్లో 4,010 పరుగులు బాదాడు. అందులో 4 సెంచరీలు, 22 అర్ధశతకాలు ఉన్నాయి. 467 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఏకంగా 32,502 పరుగులు చేశాడు. 89 సెంచరీలు, 166 అర్ధశతకాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details