Rohit Virat World Cup:భారత క్రికెట్‌కి అద్భుతమైన సేవలు అందించిన దిగ్గజాలు చాలా మంది ఉన్నారు. అందులో ఇద్దరు ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. త్వరలో మొదలు కానున్న టీ20 వరల్డ్ కప్‌లో దేశానికి ఐసీసీ కప్పు అందించాలనే లక్ష్యంతో ఇద్దరూ బరిలో దిగుతున్నారు. రోహిత్ తన ఇంటర్నేషనల్ టీ20 కెరీర్‌ని 2007లో బెల్‌ఫాస్ట్‌లో ప్రారంభించగా, కోహ్లీ ఏడాది తర్వాత దంబుల్లాలో అరంగేట్రం చేశాడు. ఈ మినీ వరల్డ్ కప్ ఈ స్టార్ ప్లేయర్స్‌కి లాస్ట్ సీజన్ కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. భారత్ ఐసీసీ ట్రోఫీ గెలిచి కూడా 13 ఏళ్లు అయిపోయింది. కోహ్లి, రోహిత్ ఈ సారి కప్పు సాధిస్తారా?
రోహిత్, కోహ్లీ కెరీర్
రానున్న T20 ప్రపంచ కప్ 2026కి, ఇండియా, శ్రీలంక ఆతిథ్యమిస్తాయి. అప్పటికి రోహిత్‌కి 39, కోహ్లీకి 37 ఏళ్లు వస్తాయి. వన్డే వరల్డ్ కప్ ఇంకా దూరంలో ఉంది. హై స్ట్రైక్ రేట్ కీలకమైపోయిన టీ20 ఫార్మాట్‌లో రోహిత్, కోహ్లి ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. అందుకే చాలా మంది, ఇది టీ20 వరల్డ్ కప్ గెలవడానికి చివరి అవకాశంగా భావిస్తున్నారు. చివరిసారి రోహిత్ 2007 టీ20 వరల్డ్ కప్, కోహ్లీ 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచారు.
పరస్పర గౌరవం
కోహ్లీ, రోహిత్ చాలా కాలంగా టీమ్‌ఇండియా తరఫున కలిసి ఆడుతున్నారు. మూడు ఫార్మాట్‌లలో భారత్‌కి అద్భుత విజయాలు అందించారు. వీరిద్దరి మధ్య క్లోజ్ ఫ్రెండ్‌షిప్ కంటే పరస్పర గౌరవం ఎక్కువగా ఉంది. రోహిత్ బ్యాటింగ్ స్కిల్స్‌ను కోహ్లీ చాలా సార్లు ప్రశంసించాడు. మొదటిసారి రోహిత్ బ్యాటింగ్‌ని చూసినప్పుడు అతడు బాల్‌ని టైమ్ చేసే స్కిల్‌ని చూసి ఆశ్చర్యపోయానని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. కోహ్లీ ఫామ్ గురించి, స్ట్రైక్ రేట్ గురించి ఆరోపణలు వచ్చిన సమయంలో రోహిత్ సపోర్ట్‌గా నిలిచాడు.