Fide candidates 2024 Gukesh :17 ఏళ్ల గుకేశ్ రీసెంట్గా కెనడా వేదికగా జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా 40 ఏళ్ల క్రితం గ్రాండ్ మాస్టర్ గ్యారీ కాస్పరోవ్ సృష్టించిన రికార్డును బద్దలుగొట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా గుకేశ్ తన కెరీర్‌ను తీర్చిదిద్ది, ఈ విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. విశ్వనాథ్ ఆనంద్ లేకపోతే ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని చెప్పాడు.
కాగా, టైటిల్ విజయం సాధించిన అనంతరం తిరిగి స్వదేశానికి తిరిగొచ్చిన గుకేశ్‌కు ఘన స్వాగతం దక్కింది. అభిమానులతో పాటు తాను చదువుతున్న వేలమ్మాళ్ స్కూల్ విద్యార్థులు కలిసి అతడికి స్వాగతం పలికారు. గుకేశ్‌ను కలవడానికి కనీసం ఒక గంట ముందు నుంచే ఎయిర్ పోర్ట్‌లో వీరంతా బారులు తీరారు. ఈ కార్యక్రమంలోనే గుకేశ్ తనకు అండగా నిలిచిన విశ్వనాథన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
"విషీ(విశ్వనాథన్ ఆనంద్) సార్ నాకు పెద్ద స్ఫూర్తి. చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన అకాడమీ ట్రైనింగ్ నాకు బాగా ఉపయోగపడింది. నేను ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం విషీ సర్. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ టైటిల్ సాధించగలిగేవాడిని కాదు" అని గుకేశ్ అన్నాడు.
ఛాలెంజింగ్ అనిపించింది - " లిరెన్‌తో పోటీపడినప్పుడు తన మానసిక సంఘర్షణ గురించి గుకేశ్ మాట్లాడుతూ " పోటీకి నన్ను నేను సిద్ధం చేసుకోవడం పెద్ద ఛాలెంజింగ్‌గా అనిపించింది. నా మీద చాలా అంచనాలు ఉన్నాయి. నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇలాగే ముందుకు వెళ్తే, నేను అనుకున్నది సాధిస్తాను అని నమ్మకం ఉంది. నా విజయం దేశానికి ఎంత పేరు తీసుకువచ్చిందో చూసి చాలా సంతోషంగా ఉంది. చెన్నైలో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు అభిమానంతో విషెస్ చెప్తున్న చిన్న పిల్లలను చూస్తే సంతోషంగా అనిపించింది. వాళ్ల అభిమానం నాకు చాలా ప్రత్యేకం" అని గుకేశ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఇకపోతే 2020లో విశ్వనాథన్ ఆనంద్ ప్రారంభించిన వెస్ట్‌బ్రిడ్జ్-ఆనంద్ చెస్ అకాడమీలో గుకేశ్ ట్రైనింగ్ పొందాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే చివరిసారిగా(2014) మన దేశం తరఫున ఈ టైటిల్ గెలుచుకుంది విశ్వనాథనే. మళ్లీ ఇప్పుడు ఇన్నేళ్లకు గుకేశ్‌కు ఆ టైటిల్ దక్కింది. ఇకపోతే గుకేశ్ తల్లిదండ్రులు కూడా ఉన్నత విద్యావంతులే.గుకేశ్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్, తండ్రి రజనీకాంత్ గుకేశ్.
'నా విజయంలో అతిపెద్ద కీలక పాత్ర ఆయనదే' - Fide Candidates 2024 Gukesh
Fide candidates 2024 Gukesh : ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో తాను విజయం సాధించడం వెనక ఉన్న వ్యక్తి గురించి తెలిపాడు 17 ఏళ్ల గుకేశ్. ఇంకా పలు విషయాలను చెప్పుకొచ్చాడు.
.
Published : Apr 25, 2024, 6:20 PM IST
|Updated : Apr 25, 2024, 6:27 PM IST
Last Updated : Apr 25, 2024, 6:27 PM IST