England Stars Not to Play IPL 2024 Playoffs :జూన్ 1న మొదలు కాబోతున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ఆయా దేశాలు ఒక్కొక్కటిగా తమ టీమ్‌లను అనౌన్స్ చేస్తున్నాయి. మంగళవారం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB), ఇంగ్లాండ్ జట్టును అనౌన్స్ చేసింది. ఈ టీమ్‌లో ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ చోటు దక్కించుకోగా, జోఫ్రా ఆర్చర్ 14 నెలల విరామం తర్వాత వరల్డ్ కప్ కోసం రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్లు ఐపీఎల్ ఫ్యాంచైజీలకు షాకిచ్చింది.
- ఐపీఎల్‌కి ముందే వెళ్లిపోనున్న ప్లేయర్‌లు
ప్రస్తుత ఐపీఎల్‌లో చాలా మంది ఇంగ్లాండ్ ప్లేయర్‌లు ఆడుతున్నారు. బట్లర్ (RR), మొయిన్ అలీ (CSK), జానీ బెయిర్‌స్టో (PBKS), సామ్ కరన్(PBKS), లియామ్ లివింగ్‌స్టోన్ (PBKS), ఫిల్ సాల్ట్ (KKR), విల్ జాక్స్(RCB), రీస్ టోప్లీ (RCB) టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ప్లేయర్‌లు ఐపీఎల్ వదిలి ఇంగ్లాండ్ చేరుకోనున్నారు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో వీరున్నారు. వీరినే మే 22 నుంచి స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగే T20I సిరీస్ కోసం సెలెక్ట్ చేసింది బోర్డు. అలానే ఈ సిరీస్‌లో భాగమవ్వాలని బోర్డు ఆదేశించింది. ఈ కారణంగా వీరు IPL 2024 చివరి మ్యాచ్‌లకు(IPL 2024 Playoffs) అందుబాటులో ఉండరు.
పాకిస్థాన్‌తో సిరీస్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ మే 31న కరేబియన్ దీవులకు వెళ్లనుంది. జూన్ 4న బార్డబోస్ వేదికగా స్కాట్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-బిలో ఉన్న ఇంగ్లాంజ్ గ్రూప్ దశలో స్కాట్‌లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, ఒమన్ దేశాలతో పోటీపడనుంది.
- ఇంగ్లాండ్ జట్టు(England World Cup Squad)
జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.