England Test Record: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. 147ఏళ్ల టెస్టు హిస్టరీలో 5 లక్షల పరుగుల మార్క్ క్రాస్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఈ మైలురాయి అందుకుంది. 1082 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఇప్పటివరకు 500000+ పరుగులు చేసింది. ఇంగ్లాండ్ టెస్టు హిస్టరీలో 1082 మ్యాచ్‌ల్లో 399 విజయాలు నమోదు చేయగా, 355 డ్రా చేసుకుంది. 327 మ్యాచ్‌ల్లో ఓడింది.
ఇంగ్లాండ్ @ 500000 పరుగులు- ప్రపంచంలోనే ఏకైక జట్టుగా రికార్డ్ - ENGLAND TEST RECORD
అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ఇంగ్లాండ్- ప్రపంచంలోనే ఏకైక జట్టు!
England Test Record (Source : Associated Press)
Published : Dec 7, 2024, 11:08 AM IST
ఇంగ్లాండ్ తర్వాత ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆసీస్ 4 లక్షల 28 వేల పైచిలుకు పరుగులు చేసింది. టీమ్ఇండియా 2 లక్షల 78వేల పైచిలుకు పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
అందులోనూ ఇంగ్లాండే టాప్
ఇంగ్లాండ్ బ్యాటర్లంతా కలిపి టెస్టుల్లో ఇప్పటివరకు 929 సెంచరీలు బాదారు. అత్యధికంగా జో రూట్ 35 శతకాలతో టాప్‌లో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్లంతా కలిసి 592 సెంచరీలు బాదగా, టీమ్ఇండియా ఆటగాళ్లు 552 శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు.