తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 10:53 PM IST

ETV Bharat / sports

గ్లాస్‌ బ్రేకింగ్‌ ఇన్నింగ్స్‌ - పెర్రీకి టాటా సంస్థ స్పెషల్ గిప్ట్​

Ellyse Perry Gift : ఇటీవల డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ఆర్సీబీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ చేరిన జోష్‌లో ఉన్న ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్‌ ఎల్లీస్‌ పెర్రీకి మరో బహుమతి లభించింది. ఆమె సంచలన బ్యాటింగ్‌కి గుర్తుగా టాటా మోటర్స్‌ కంపెనీ ప్రత్యేక బహుమతి అందించింది. అదేంటంటే ?

Ellyse Perry Gift
Ellyse Perry Gift

Ellyse Perry Gift :మార్చి 4న బెంగళూరు, చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్‌, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో లాంగ్‌ ఆన్‌ దిశగా పెర్రీ సిక్సర్‌ కొట్టింది. బంతి నేరుగా వెళ్లి బౌండరీ లైన్‌ అవతల పార్క్‌ చేసున్న టాటీ పంచ్‌ ఈవీ కార్‌ విండో గ్లాస్‌ని బద్దలు కొట్టింది. ఈ ఘటనను గుర్తు చేస్తూ, పెర్రీ ప్రతిభను గుర్తిస్తూ టాటా కంపెనీ ప్రత్యేక గిఫ్ట్‌ అందించింది. ముక్కలైన కార్‌ విండో గ్లాసెస్‌ ముక్కలతో రూపొందించిన అద్భుతమైన గిష్ట్‌ని ఆమెకు బహూకరించింది.

కారు అద్దాన్ని బద్దలు కొట్టిన ఆ సిక్సర్‌
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ 37 బంతుల్లో 58 పరుగులు చేసింది. మ్యాచ్‌ తర్వాత, పెర్రీ మాట్లాడుతూ.. జరిగిన యాక్సిడెంట్‌కి సంబంధించి తనకు ఇన్సూరెన్స్‌ లేదని ఫన్నీ కామెంట్స్‌ చేసింది. టాటా మోటార్స్ ఈ ఘటనను అద్భుతమైన జ్ఞాపకంగా మార్చేసింది. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎలిమినేటర్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించిన తర్వాత, టాటా కంపెనీ ఎల్లీస్ పెర్రీకి బహుమతి ప్రదానం చేసింది. దానిపై "Courtesy # పెర్రీ పవర్​ఫుల్ పంచ్​ 04-03-24" అని రాసుంది. ఇది చూసిన ఫ్యాన్స్ పెర్రీ ఆట తీరును కొనియాడుతున్నారు. ఫొటోను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ సీజన్​లో పెర్రీ నిలకడగా రాణించి ఆకట్టుకుంది. ముంబయితో జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌లో 50 బంతుల్లో 66 పరుగులు చేసి సత్తా చాటింది. అంతే కాకుండా ఆమె బౌలింగ్‌లోనూ రాణించింది. నాలుగు ఓవర్లలో ఒక వికెట్‌ తీసి కేవలం 29 పరుగులు ఇచ్చింది. ముంబయికి కేవలం 135 పరుగుల టార్గెట్‌ నిర్దేశించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ విజయం సాధించడంలో పెర్రీ కీలక పాత్ర పోషించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఈ టోర్నమెంట్‌లో పెర్రీ మొత్తం 8 మ్యాచ్‌లలో 312 పరుగుల చేసి, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ముంబయితో ఆర్సీబీ ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌లో 6/15తో అద్భుతమైన బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి, డబ్ల్యూపీఎల్​లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

థ్రిల్లింగ్​ విక్టరీ- ఫైనల్​కు దూసుకెళ్లిన బెంగళూరు- ముంబయికి షాక్​

RCB పేరులో మార్పు- ఐపీఎల్​కు ముందు కీలక నిర్ణయం- ఎందుకో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details