Dravid On Ishan Kishan Iyer: టీమ్ఇండియా సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చెలరేగిపోయింది. బజ్‌బాల్ వ్యూహానికి చెక్ పెడుతూ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఇక ధర్మశాలలో చివరి మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్మీట్లో పాల్గొన్నాడు. ఈ మీట్లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఫ్యూచర్ కెరీర్, వారి సెంట్రల్ కాంట్రాక్ట్ గురించి ద్రవిడ్‌ను అడగ్గా రిప్లై ఇచ్చాడు.
'సెంట్రల్ కాంట్రాక్ట్‌లు నేను డిసైడ్ చేయను. కనీసం అది ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారో కూడా నాకు తెలీదు. ఆ ఇద్దరూ క్రికెట్ ఆడడం కొనసాగిస్తారని అనుకుంటున్నా. వాళ్లు పూర్తి ఫిట్నెస్తో సెలెక్టర్లకు అందుబాటులో ఉండాలి. ఇక తుది జట్టులోను మాత్రం నేను, రోహిత్ కలిసి ఎంపిక చేస్తాం. ప్లేయర్‌తో సంబంధం లేకుండా, వారి ఆటతీరును బట్టే వారిని జట్టులోకి తీసుకుంటాం. అందులో ఎవరు కాంట్రాక్ట్‌లో ఉన్నారు, ఎవరు లేరు? అనే విషయం కూడా నాకు తెలీదు. అందుకే కాంట్రాక్ట్‌లో లేని ప్లేయర్లు కూడా టీమ్ఇండియాకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది' అని రాహుల్ అన్నాడు.
టెస్టు ప్లేయర్లకు బంపర్ ఆఫర్?: టీమ్ఇండియా ఆటగాళ్లకు రీసెంట్గా బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. పురుషులకు టెస్టు ఫార్మాట్ మ్యాచ్ ఫీజు పెంచనున్నట్లు బోర్డు సెక్రటరీ జై షా శనివారం వెల్లడించారు. ఆటగాళ్ల ఆర్ధిక స్థిరత్వాన్ని దృఢపర్చేందుకు 'టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్' పేరిట అదనపు ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు షా తెలిపారు. ఈ ఇన్సెంటివ్ స్కీంతో ఆయా ప్లేయర్‌కు అత్యధికంగా ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల దాకా ఫీజు రూపంలో అందనుంది. ఇది 2022-23 సంవత్సరం నుంచే అమలైనట్లు షా పేర్కొన్నారు.