Dhoni Funny Moments With Reporters :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్లో జట్టుకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను అందించాడు. ఓ ప్లేయర్‌గా, అలాగే ఓ కెప్టెన్‌గానూ జట్టును ముందుండి నడిపించాడు. ఆన్‌ఫీల్డ్, అవుట్ ఫీల్డ్‌లోనూ కూల్‌గా ఉంటాడు ధోనీ. అందుకే ఆయన్ను ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. అయితే ఆయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్‌లో తెలివిగా, ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చి అక్కడి వారిని నవ్వించారు. ఈ క్రమంలో ధోనీ ఫన్నీ ప్రెస్ మీట్లపై ఓ లుక్కేద్దాం పదండి.
1.రిపోర్టర్ ప్రశ్నకు ధోనీ ఫన్నీ రిప్లై
2016 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీ ఫైనల్లో ఓడిపోయింది. అప్పుడు ఓ విదేశీ రిపోర్టర్ ధోనీని మీ కెరీర్లో ఇంకా చాలా సాధించిన తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించాడు. దానికి 'నేను అన్‌ఫిట్ అని మీరు అనుకుంటున్నారా?' అంటూ ధోనీ జర్నలిస్టును అడిగాడు. అందుకు లేదు అని రిపోర్టర్ బదులిచ్చాడు. 2019 ప్రపంచకప్ వరకు నేను సర్వైవ్ అవ్వగలనా అని అడగ్గా, అవును అని రిపోర్టర్ అన్నాడు. "దీంతో మీరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేశారు" అని ధోనీ హిలేరియస్‌గా రిప్లై ఇచ్చాడు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా నవ్వారు.
2. 'ఆ స్క్రిప్ట్ తో సినిమా తీయొచ్చు'
2014లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమ్ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలకు ధోనీ ఫన్నీగా చెక్ పెట్టేశాడు. మార్వెల్ లేదా వార్నర్ బ్రదర్స్ వంటి ప్రొడక్షన్ హౌజ్‌లు ఈ పుకార్లను వ్యాప్తి చేసే వ్యక్తి నుంచి స్క్రిప్ట్‌ను తీసుకుని సినిమా చేయాలని సూచించాడు.
3. 'నేను స్టూల్‌పై లేను కదా'
2016లో రాంచీలో జరిగిన ఓ టీ20 మ్యాచ్ తర్వాత ధోనీని హెలికాప్టర్ షాట్ కొట్టకపోవడం గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. "సముద్రం కింద లేదా జలాంతర్గామిలో హెలికాప్టర్ ఎగరదు. అదే విధంగా ఒక నిర్దిష్ట డెలివరీకి హెలికాప్టర్ షాట్ ఆడాలి. బౌలర్ బౌన్సర్ వేస్తే హెలికాప్టర్ షాట్ కొట్టలేను. నేను స్టూల్‌పై లేను కదా" అని ధోనీ సమాధానం ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా నవ్వులే నవ్వులు.
4. 'నా ఇంట్లో చాలా కార్లు, బైక్ లు ఉన్నాయి'
2018లో క్వాలిఫైయర్ 1లో సన్‌రైజర్స్‌తో చెన్నై తలపడింది. ఆ మ్యాచ్‌లో జట్టులో హర్భజన్ సింగ్ ఉన్నప్పటికీ ఒక్క ఓవర్ కూడా ధోనీ అతడితో బౌలింగ్ చేయించలేదు. మిగతా ఐదుగురు బౌలర్లలో ఫుల్ కోటా ఓవర్లు వేయించాడు. అప్పుడు ధోనీనీ ఓ రిపోర్టర్ సీనియర్ బౌలర్ అయిన హర్భజన్‌తో ఎందుకు ఒక్క ఓవర్ కూడా వేయించలేదని అడిగాడు. 'మీకు తెలుసా, నా ఇంట్లో చాలా కార్లు, బైక్‌లు ఉన్నాయి. కానీ అన్నింటిని నేను ఒకేసారి రైడ్ చేయను. ఆ మ్యాచ్‌లో హర్భజన్ బౌలింగ్ చేయడం అవసరమని నేను భావించలేదు. అందుకే బౌలింగ్ వేయించలేదు.' అని బదులిచ్చాడు.
5.కిషోర్ కుమార్ టు సీన్ పాల్
2011-12 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా 0-4 తేడాతో ఓడింది. ఆ తర్వాత శ్రీలంకలో జరగిన ముక్కోణపు వన్డే సిరీస్‌కు చాలా మంది యువ ఆటగాళ్లు భారత జట్టులో చేరారు. వీరిలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ ఉన్నారు. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లతో, వన్డే సిరీస్‌లో యువ ప్లేయర్లతో ఆడటం ఏంటని అప్పటి కెప్టెన్ ధోనీని ఓ విలేకరి ప్రశ్నించాడు. పాపులర్ సింగర్ కిషోర్ కుమార్ నుంచి డీజే స్టార్ సీన్ పాల్ వైపునకు వెళ్లామని ధోనీ రిప్లై ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు.
ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు - యూవీ ఐకానిక్ ఇన్నింగ్స్‌పై ధోనీ ఏమన్నాడంటే? - Dhoni Said This To yuvraj 6 sixes
మిస్టర్ కూల్‌కు కోపం వస్తుందా? - ఓటమితో వాటర్ బాటిల్‌ను తన్నిన మహీ! - MS Dhoni losses his cool