Delhi Capitals Matches Vizag:2024 ఐపీఎల్ తొలి విడత షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22నుంచి ఏప్రిల్ 7దాకా మొత్తం 21 మ్యాచ్‌లు ఆయా వేదికల్లో జరగనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై చెపాక్ స్టేడియం వేదికకానుంది. తొలి విడత టోర్నీలో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక ఈసారి విశాఖపట్టణంలోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కానీ, విశాఖ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కాకుండా దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హోం గ్రౌండ్ కానుంది. ఎందుకంటే?
టోర్నీలో అన్ని జట్లు తమతమ హోం గ్రౌండ్లో కనీసం రెండేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. కానీ, దిల్లీకి మాత్రం తొలి విడత టోర్నీలో విశాఖ స్టేడియం హోం గ్రౌండ్ కానుంది. అయితే 2024 డబ్ల్యూపీఎల్‌లో ఎలిమినేటర్ సహా, ఫైనల్ మ్యాచ్ దిల్లీ అరుణ్ జైట్లి మైదానంలోనే జరగనున్నాయి. డబ్ల్యూపీఎల్ ముగిసిన 11 రోజుల్లోనే దిల్లీ సొంత మైదానంలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఒకే గ్రౌండ్లో వరుస మ్యాచ్‌లు నిర్వహిస్తే పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండడం వల్ల, దిల్లీ ఫ్రాంచైజీ- బీసీసీఐ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో 31న చెన్నైతో, ఏప్రిల్ 3న కోల్‌కతాతో దిల్లీ క్యాపిటల్స్ విశాఖ స్టేడియంలో తలపడనునుంది. ఇక రెండో విడత టోర్నీలో దిల్లీ మిగిలిన 5 మ్యాచ్‌లు యథావిథిగా హోం గ్రౌండ్‌లోనే ఆడనుంది.
హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే?సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విడత టోర్నీలో 4మ్యాచ్‌లు ఆడనుంది. అందులో రెండు మ్యాచ్‌లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. మార్చి 27న ముంబయి ఇండియన్స్‌తో, ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హోం గ్రౌండ్లో ఆడనుంది. ఇక మార్చి 23న కోల్‌కతాతో, మార్చి 31న గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడనుంది.